Lover’s Suicide: కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మృతిని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వారం రోజుల క్రితం తన ప్రియుడు మృతి చెందడంతో సూర్యారావుపేటకు చెందిన తాటికొండ లోహిత తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు లోహితను కొంతకాలం పిన్ని ఇంట్లో ఉంచేందుకు కంకిపాడుకు పంపించారు.
Read Also: This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
అయితే, వారం రోజులు గడవక ముందే తీవ్ర విషాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ఇంట్లో వాళ్లు లేచే సరికి తాటికొండ లోహిత పిన్ని వాళ్ల ఇంట్లో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు కంకిపాడు పోలీసులకు సమాచారం అందజేయడంతో.. క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. యువతి ఆత్మహత్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపుతుంది.
