NTV Telugu Site icon

Crime News: బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్, 8 మంది అరెస్ట్

Gange Rape

Gange Rape

అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుందని.. నేరగాళ్లు అత్యాచారాన్ని మొబైల్‌లో చిత్రీకరించి పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. దాదాపు మూడు వారాల తర్వాత వీడియో బయటపడిందని పోలీసులు తెలిపారు.

Read Also: Minister Seethakka: మాకు ఎలాంటి కక్ష లేదు.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై సీతక్క కామెంట్‌

ఈ ఘటనపై గౌహతి వెస్ట్ డీసీపీ పద్మనాభ్ బారువా మాట్లాడుతూ.. “తొమ్మిది మంది నిందితులలో ఎనిమిది మంది రాబిన్ దాస్, కుల్దీప్ నాథ్ (23), బిజోయ్ రభా (22), పింకు దాస్ (18), గగన్ దాస్ (21), సౌరవ్, బోరో (20), మృణాల్ రభా (19), దీపాంకర్ ముఖియా (21)లను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. కాగా.. గౌహతిలోని గోర్చుక్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారి ధర్మేంద్ర కలితకు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వాట్సాప్‌లో గ్యాంగ్ రేప్ వీడియో వచ్చింది. ఈ క్రమంలో.. గౌహతిలోని బోరగావ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులను తొలుత అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. విచారణలో ఈ కేసులో ఉన్న ఇతర నిందితులను కూడా గుర్తించారు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ సంచలనం..దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?

దీంతో.. నూన్‌మతి, జలుక్‌బరి తదితర ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఉదయం నాటికి ఏడుగురు నిందితులను అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారు. సాయంత్రానికి మరో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. నవంబర్ 17 సాయంత్రం, బాలిక రాస్ మహోత్సవం కోసం నిందితులలో ఒకరితో కలిసి ఆలయానికి వచ్చిందని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న తొమ్మిది మంది నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. వీడియో రికార్డు చేశారని డీసీపీ తెలిపారు. మరోవైపు.. సోషల్ మీడియా వినియోగదారులకు వీడియో ఏదైనా సోర్స్ నుండి వస్తే ఎవరికీ పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను షేర్ చేయడం నేరపూరిత చర్య అని, ఎవరైనా షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Show comments