Cyber Crime: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో 42 శాతం మంది.. ప్రతి 10 మందిలో నలుగురు బాధితులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు టెక్నాలజీ పెరుగుతోంది.. కొత్త కొత్త మోడల్స్‌లో స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. అన్నింటికీ ఫోన్ నంబర్ లింక్.. ఇదే సమయంలో.. సైబర్ నేరగాళ్లు తమ పని ఈజీగా కానిస్తున్నారు.. గుట్టుచప్పుడు కాకుండా.. గుట్టుగా ఖాతాల్లో ఉన్నది మొత్తం లాగేస్తున్నారు.. రోజుకో కొత్త ఐడియా.. పూటకో ప్లాన్ అనే తరహాలో.. కొత్త తరహా మోసాలకు తెరలేపుతూ.. ప్రజలు తమ ఉచ్చులో పడేలా చేస్తున్నారు.. ప్రస్తుతం డిజిటల్ యుగం కావడం.. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన నేపథ్యంలో మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఎంతో మంది సైబర్ మోసాల బారిన పడుతూ డబ్బులు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో తాము లేదా తమ కుటుంబంలో ఒకరు ఆర్థిక మోసానికి గురైనట్లు 42 శాతం తెలిపారంటనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతినెల దాదాపు 80 వేల కేసులు నమోదు అవుతున్నాయి.. దాదాపు ప్రతి నెల 200 కోట్ల రూపాయలను సైబర్ నెరగాళ్లు కొల్ల కొడుతున్నట్టు తాజా సర్వే బయటపెట్టింది..
Read Also: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. ఇది మాత్రం మరవొద్దు..!
Also Read
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సర్వే నిర్వహించారు.. డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు ఆన్‌లైన్ పేమెంట్లతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు ప్రజలు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ప్రజలు సైబర్ నేరగాల బారిన పడుతున్నారు.. సగటున తెలంగాణలో 9 కేసులు నమోదు అవుతున్నాయంటే.. ఏ స్థాయిలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.. గ్రేటర్ హైదరాబాద్‌లోని పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లు (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) పరిధిలో దాదాపు 5వేల కేసులు నమోదు అయినట్టు ఆ సర్వే పేర్కొంది.. కొత్త తరహా మోసాలకు తెరలేపుతూ అనుమానం రాకుండా పని కానిస్తున్నారు సైబర్ నేరగాళ్లు… రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉన్నట్టు పోలీసు రికార్డు చెబుతున్నాయి. ఇక, గత మూడేళ్లలో నమోదైన కేసుల్లో కేవలం 17 శాతం కేసుల్లో మాత్రమే బాధితుల సొమ్మును రికవరీ చేశారట.. సగటున ప్రతి 10 మందిలో నలుగురు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నట్టు ఆ సర్వేలో తేలడం ఆందోళనకు గురిచేసే అంశం.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
-
Talliki Vandanam Scheme: గుడ్‌న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!