Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అయ్యప్పమాల ధరించిన విద్యార్థులు ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కారులో ఒంగోలుకు బయలుదేరారు. నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ రోడ్డులో ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని కారు వెనుకనుంచి ఢీకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా లారీ కిందకు వెళ్లిపోయింది. ఘటనలో నలుగురు విద్యార్థులు స్పాట్ లోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులు రామిరెడ్డి, శ్రీకాంత్, మహేష్, కార్తీక్, వాసులుగా గుర్తించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదంపై వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఇలా.. వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి..
Read Also: Eluru Crime: రౌడీ షీటర్ల బరితెగింపు.. యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి అత్యాచారం..!