దారుణం: కన్న కూతురినే కిడ్నాప్ చేసిన తండ్రి.. కొడుకుతో కలిసి ఆమెను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజరోజుకు పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తమ కులంకాని వ్యక్తిని ప్రేమించారని తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి తన కులంకాని వాడిని కూతురు పప్రేమించి పెళ్లి చేసుకొందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ ప్రాంతానికి చెందిన బుద్ధపాల్ సక్సేనాకు ఒక కొడుకు, ఒక కూతురు రోషిణి..ఆమె అదే గ్రామానికి చెందిన ప్రభాత్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడు వారి కులం కాకపోవడంతో వారి పెళ్ళికి ఒప్పుకోరని తెలిసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇటీవల్ ఆ విషయం తెలుసుకున్నా బుద్ధపాల్ సక్సేనా అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. బయట ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరువుపోతుందని దారుణానికి ఒడిగట్టాడు. తన కొడుకు, మరో ఇద్దరు బంధువుల సహాయంతో రోషిణిని కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం పక్కనే నిర్మానుష్య ప్రదేశంలో శవాన్ని కాల్చి బూడిద చేశారు.
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
తెల్లారి కూతురు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడగగా కూతురు ప్రియుడు ప్రభాత్ పేరు చెప్పాడు. దీంతో అతడిని పోలీసులు విచారించగా అతడు జరిగిందంతా వివరించాడు. ఇక రోషిని తండ్రి అనుమానిత తీరును అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో ప్రశ్నించగా నిజం బయటపెట్టాడు. తన కూతురు ప్రభాత్ ని ప్రేమించి తమకు తెలియకుండా పెళ్లి చేసుకుందని, అందుకే కూతురును చంపానని ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి, కొడుకు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!