AP Crime: మారిపోయిన భూ యజమాని పేరు.. ఎమ్మార్వో ఎదుటే బాధితుడి ఆత్మహత్యాయత్నం..
- బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో ఆఫీసులో కలకలం..
- ఎమ్మార్వో సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..
- ఐదెకరాల భూమిపై విషయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: తమ పేరుపై ఉండాల్సిన భూమి.. తమ ప్రమేయం లేకుండానే మరో వ్యక్తి పేరు మీదకు మారిపోవడంతో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.. బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో ఆఫీసులో పల్లమాలకు చెందిన పాండు అనే వ్యక్తి ఎంఆర్వో సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ ఐదెకరాల భూమిపై గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. అయితే, ఈ నెల 8వ తేదీ వరకు తన తల్లి వదప్పగారి అనసూయమ్మ పేరు మీద ఉన్న భూమి.. ఇప్పుడు బి.రవీంద్రబాబు పేరు మీదకు ఎలా మారిందంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఎమ్మార్వో అక్కడే ఉండడంతో ఆయన సమక్షంలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.. వెంటనే స్థానికులు అడ్డుకున్నారు.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నాడు.. అయితే, అధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర తీవ్ర కలకలం రేగింది..
Read Also: Etela Rajender: ఇది అబద్ధమైతే నేను రాజకీయల నుంచి తప్పుకుంటా.. ఈటల సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!