Fake Aadhar : ఏటీఎం దొంగల గురించి పోతే.. ఈ ముఠా చిక్కింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీగ లాగితే డొంక కదిలిందే అనే సామెత మనం వినే ఉంటాం. అలాంటి సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొందరు దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేసి పరారయ్యారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. అయితే.. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్ అకూన్ గురించి వెల్లడించాడు.
నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్ పేర్కొన్నాడు. దీంతో అకూన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా.. 31 ఆధార్‌కార్డులు, 13 పాన్‌కార్డులు, 90 ఆధార్ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. అంతేకాకుండా హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. అయితే మిగితా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
తాజావార్తలు
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
-
Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
-
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!