డ్రగ్స్ కేసు నిందితుడు హన్మంత్ లొంగుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు బండారు హన్మంత్ కోర్టులో లొంగిపోయాడు. ఎల్బీనగర్ కోర్టులో హన్మంత్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా హన్మంత్ వున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్‌లో డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాటున డ్రగ్స్ తయారుచేస్తున్నాడు హన్మంత్ రెడ్డి. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు బాలానగర్ పోలీసుల యత్నించారు. కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.
Also Read
- Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్‌స్టా స్టోరీ!
- Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
- Honour Killing: గోల్కొండలో ఘోరం.. యూట్యూబర్‌ను వెంటాడి చంపిన వైనం..!
ఈనెల 23వ తేదీన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన పవన్ మెపిడ్రిన్ డ్రగ్‌ను స్థానికంగా అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
దీంతో మాదకద్రవ్యాల గుట్టురట్టయింది. అతనిచ్చిన సమాచారంతో.. తక్షణమే పోలీసులు మేడ్చల్‌లోని మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా, ఆయన వద్ద 926 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రామకృష్ణగౌడ్ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేసి, 4 కిలోల మెపిడ్రిన్ డ్రగ్‌ను సీజ్ చేశారు.
సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య గౌడ్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎస్‌కే రెడ్డి, హనుమంత రెడ్డి పరారీలో ఉండగా… తాజాగా హన్మంత్ రెడ్డి లొంగిపోవడంతో కేసులో కీలక విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Meloni: జీ 7 సదస్సులో ధూమపానంపై ఆసక్తికర సంభాషణ.. మెలోనికి అభినందనలు
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Suvendu Adhikari: దీదీ ‘ఖతం’ చేయాలనుకున్న గూర్ఖా దళానికి ఊపిరి పోస్తున్న సువేందు అధికారి.. బెంగాల్లో రాజకీయాల్లో కొత్త రచ్చ!
-
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!