సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు బండారు హన్మంత్ కోర్టులో లొంగిపోయాడు. ఎల్బీనగర్ కోర్టులో హన్మంత్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా హన్మంత్ వున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్‌లో డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాటున డ్రగ్స్ తయారుచేస్తున్నాడు హన్మంత్ రెడ్డి. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు బాలానగర్ పోలీసుల…