Actress Nakshathra: అర్థరాత్రి బస్సులో డ్రైవర్ నీచ పని.. ఆ నటి ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Harassed Actress Nakshathra Sister In Bus: ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా.. కామాంధుల్లో మార్పు రాకపోగా, మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు.. లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓ బస్సు డ్రైవర్ కూడా అలాంటి నీచ పనే చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతగాడు.. బస్సులోనే ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తెలివిగా ప్రదర్శించి, అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
‘వల్లి తిరుమనం, యారది నీ మోహిని’ వంటి సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న మలయాళ నటి నక్షత్ర సోదరి ఇటీవల చెన్నై నుంచి కేరళలోని తన స్వస్థలానికి బయలుదేరింది. ఓ ప్రైవేట్ బస్సెక్కిన ఆమె జర్నీ.. మొదట్లో సాఫీగానే సాగింది. అయితే.. అర్థరాత్రి నిద్రపోయాక ఆమెకు ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది. అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత.. ఆ బస్సులో ఉండే రెండో డ్రైవర్, ఆమెను అసభ్యంగా తాకాడు. వెంటనే తేరుకున్న ఆమె.. ఏం చేస్తున్నావని అతడ్ని గట్టిగా నిలదీసింది. దాంతో భయపడిపోయిన ఆ డ్రైవర్.. పొరపాటున చెయ్యి తగిలిందంటూ తన తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
కానీ.. అతడు తప్పుగానే ప్రవర్తించాడని ఆ అమ్మాయి బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులకు చెప్పింది. దీంతో.. ఆ బస్సులో ఉన్న ఇతర మహిళలు సైతం, ఆ డ్రైవర్ తమతో కూడా అలాగే ప్రవర్తించాడని ఆరోపించారు. ఇంకేముంది, అందరూ కలిసి అతనికి గట్టిగా క్లాస్ పీకారు. ఆ దెబ్బకు అతడు మళ్లీ వాళ్ల జోలికి వెళ్లలేదు. ఈ విషయాన్ని తన సోదరి నక్షత్రకు తెలియజేయగా.. ఆమె మొత్తం తతంగాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ బస్సు డ్రైవర్ ఫోటో కూడా షేర్ చేస్తూ.. అతనిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయ్ విజయన్‌లను ట్యాగ్ చేసింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?