Double Murder : జనగామ జిల్లాలో దారుణం జరిగింది. తల్లీకూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు. 80 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా చంపేశారు దుండగులు. ప్రస్తుతం తల్లీ కూతుళ్ల హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనగాం జిల్లా జాఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లిలో గాలి రాణి.. తన తల్లి తుమ్మ అన్నమ్మతో కలిసి ఉంటోంది. అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఐతే ఈ తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. 80 ఏళ్ల వృద్ధురాలిని దుండగులు ఇంట్లోనే చంపేశారు. ఆ తర్వాత ఆమె కూతురు రాణిని ఆరుబయట హత్య చేసి పారిపోయారు..
ZPTC By Elections: కడప జిల్లా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు..!
జనగాం జిల్లా జాఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లిలో ఉంటున్నరాణి.. భర్త జాజిరెడ్డి మృతి తర్వాత 80 ఏళ్ల తల్లితో కలిసి నివాసం ఉంటుంది. రాణి కూతురు కవితకు పెళ్లయింది. ఆమె విజయవాడ దగ్గర ఉంటోంది. ఇక రాణి ఇంట్లో పని చేసేందుకు పనిమనిషి వచ్చి తలుపు తెరవగానే అన్నమ్మ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పనిమనిషి జెన్నిక.. విషయాన్ని స్థానికులకు తెలిపింది. అదే సమయంలో ఇంటి ఆరుబయట రాణి తలపై బలంగా కొట్టి ఆమెపై బెడ్ షీట్ కప్పి ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జంట హత్యలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు…
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్స్ స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాలని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. రాణి కూతురు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు… ప్రశాంతంగా ఉండే పల్లెలో తల్లీ కూతుళ్ల జంట హత్యలు కలకలం రేపాయి. ఎవరితో ఎలాంటి విభేదాలు లేని 80 ఏళ్ల వృద్ధురాలు, 60 ఏళ్ల పైబడిన మహిళను హత్య చేసింది ఎవరు? హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? దోపిడి దొంగల పని అనుకుందామన్నా వారి బంగారం వారి దగ్గరే ఉంది. ఆస్తుల తగదాలు ఏమీ లేవంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఈ జంట హత్యలు మిస్టరీని తలపిస్తున్నాయి.
AP Liquor Scam Case: జగన్ ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు..! డేట్ చెప్పలేం..