Telangana Secretariat: నేటి నుంచి సెక్రటేరియట్‌లో అటెండెన్స్.. లేటుగా వస్తే లాసేనా..
- ఇవాళ్టి నుండి సెక్రటేరియట్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్..
- ఇన్ టైం...ఔట్ టైం అటెండెన్స్ తప్పనిసరి అంటూ సర్క్యులర్ జారీ..
- సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుండి జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు వర్తింపు..
- ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పై ఉద్యోగులు అసంతృప్తి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 10 గంటలకే ఉద్యోగులు సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుండి జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వర్తిస్తుందని తెలిపారు. సమయం సందర్భం లేకుండా.. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులకు వస్తున్నారని, వారి సమయానికి వెళ్లిపోతున్నారని ఆరోపణల వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సీఎస్ ప్రవేశపెట్టారు. సెక్రటేరియట్ లోకి ప్రవేశించే అన్ని పాయింట్ల వద్ద ఈ పరికరాలను అమర్చారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
Read also: Gold Rate Today: మూడు రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
Also Read
- Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
అధికారులు, ఉద్యోగులు, రెగ్యులర్ సిబ్బందితో పాటు సచివాలయ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా వేతనాలు పొందుతున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి ఒక్కరు ఇన్ టైం.. ఔట్ టైం అటెండెన్స్ తప్పనిసరి అంటూ సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ అటెండెన్స్ సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుంచి జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Read also: Syriya-Israel: సిరియాలో 80 శాతం అస్తులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడి
వీరందరూ ఇవాల్టి నుంచి ఇన్ టైం.. ఔట్ టైం వేయకుండా వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై అనుమానం వ్యక్తమతున్నాయి. ఒక వేలా ఉద్యోగులు లేటుగా వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన వలసి వస్తుందో? అనే అనుమం మొదలైంది. సచివాలయంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంతా కలిపి సుమారు 2500 మందికి పైగా ఉంటారని అంచనా. అటెండెన్స్ విధానంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రవీణ్ కుమార్, సరిత అనే ఇద్దరు కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే లేట్ గా వస్తే జీతం కట్ చేస్తారా? లేదా? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Read also: Avanthi Srinivas Resign To YCP: వైసీపీకి రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అవంతి
దీంతో మొన్నటి వరకు సమయం సందర్భం లేకుండా ఇష్టాను సారంగా సచివాలయానికి వచ్చిన వారందరికి ఈ నిబంధన ఇబ్బందే అని చెప్పాలి. ఒకవేళ లేట్ గా వచ్చిన వారికి జీతం లాస్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అనే అనుమానం పెరిగింది. అయితే ఎవరైనా సరే అటెండర్స్ ప్రకారం నెలకు జీతం కట్ అవకుండా.. పూర్తీ సాలరీ అందుకోవాలంటే సెక్రటేరియట్ కు సమయానికి పరుగులు పెట్టాల్సిందే. మరి ఆలస్యంగా వచ్చే వారికి సాలరీ కట్ అవుతుందా? లేదా? అనేది వచ్చే నెల జీతం అకౌంట్ లో పడేంత వరకు వేచి చూడాల్సిందే..
Pushpa 2 The Rule : పార్టీ ఉంది పుష్ప.. టీం సక్సెస్ పార్టీ అదిరింది!
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!