DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- సిగరెట్ వెలిగించుకునేందుకు అగ్గిపుల్ల ఇవ్వలేదని గొడవ.
- ఢిల్లీలో యువకుడి దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DELHI: సిగరెట్ వెలిగించుకునేందుకు అగ్గిపుల్ల ఇవ్వాలేదనే విషయంపై జరిగిన చిన్న వివాదం ఒక యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని కేశవ్‌పురంలో జరిగింది. మరణించిన వ్యక్తిని 30 ఏళ్ల భవానీగా గుర్తించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ నేరంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కేశవ్‌పురం ప్రాంతంలో ఓ వైన్ షాపు ముందు భవానీ, ఆశారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వారిని సిగరెట్ వెలిగించుకునేందుకు అగ్గిపుల్ల ఇవ్వాలని కోరారు.
తమ వద్ద అగ్గిపెట్టే లేదని చెప్పడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడివ తీవ్రం కావడంతో నిందితులు ఇద్దరిపై దాడికి పాల్పడి, కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో భవానీ తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే దీప్ చంద్ర బంధు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భవానీ పొట్లలో ఎడమవైపు తీవ్రమైన గాయమైనట్లు పోలీసులు తెలిపారు. మరో బాధితుడు ఆశారామ్ ఛాతిలో కత్తిపోటుకు గురయ్యాడు.
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నరేశ్ బహదూర్ అలియాస్ నేపాలీ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు తరుణ్ (19), మరో మైనర్ నేరస్తుడిని కూడా పట్టుకున్నట్లు వెల్లడించారు. నరేష్ కత్తితో దాడిచేసినట్లు తేలింది. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!