పోలీసులు ఎంత నిఘా పెట్టినా..డ్రగ్ పెడ్లరు మాత్రం తమ దందా ఆపడం లేదు. మత్తు పదార్థాలు తరలిస్తూనే ఉన్నారు. వినియోగదారులకు అందిస్తూనే ఉన్నారు. కానీ అప్పడప్పుడు..మాత్రం పోలీసులకు చేతికి చిక్కుతున్నారు. హైదరాబాద్ చాలా రోజుల తర్వాత భారీగా కొకైన్ పట్టుబడింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతా ఎవరి బిజీలో వారు ఉన్నారు. భారీగా ట్రాఫిక్ రద్దీ… పండగ షాపింగ్స్‌తో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. కానీ అక్కడే కొంత మంది తమ డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు..
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
మిస్బహుద్దీన్ ఖాన్, అలి అస్గర్, జుబేర్ అలి, మహ్మద్ అజీమ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వారందరికీ డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది. ఐతే తాము తీసుకోవడంతో పాటు డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బెంగళూరు వెళ్లారు. అక్కడ కొకైన్ కొనుగోలు చేసి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న డ్రగ్ వినియోగదారులకు అందించేందుకు అంతా ప్లాన్ చేశారు. కానీ ఈ లోగానే వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 33.3 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 4 మొబైల్ ఫోన్స్, ఇన్నోవా క్రిస్టా కార్ సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో జుబేర్ అలీ అనే వ్యక్తి అమెరికా పౌరుడు.. 2 నెలల క్రితం హైదరాబాద్ వచ్చి.. డ్రగ్ పెడ్లర్లతో చేతులు కలిపాడు. డ్రగ్ రవాణా కోసం తన కారు ఉపయోగించాడు..
మరోవైపు ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనూ భారీగా కొకైన్ పట్టుబడింది. దాదాపు 5.5 కిలోల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దాని విలువ దాదాపు రూ. 82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ లేడీ వద్ద ఈ కొకైన్ గుర్తించారు. గోల్డ్ కలర్ చాక్లెట్ల రూపంలో కొకైన్ తరలించేందుకు ఆ లేడీ ప్రయత్నించింది. అవి చూస్తే అచ్చం చాక్లెట్ల లాగే ఉన్నాయి. దీంతో ఎవరూ కనిపెట్టరని అంచనా వేసింది. కానీ కస్టమ్స్ అధికారులు గుర్తించడంతో కొకైన్ విషయం బయట పడింది. దీంతో ఆ కిలాడీ లేడీపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు..
OG : “ఓజీ లాస్ట్ షెడ్యూల్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బిగ్ అప్‌డేట్!”