Gym trainer Murder: పెళ్లికి కొన్ని గంటల ముందు కొడుకును చంపిన తండ్రి.. కారణం చెప్పిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29) హత్య సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద ఉండాల్సిన వరుడు హత్యకు గురయ్యాడు. గౌరవ్ సింఘాల్‌ని అతని తంండ్రి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తండ్రి రంగలాల్ హత్య చేశాడని, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గౌరవ్ తనను రోజూ తిడుతుండే వాడనే కోపంతో రంగలాల్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో గౌరవ్ అతడి ఇంట్లో అర్థరాత్రి హత్యకు గురయ్యాడు. తెల్లవారితే అతడి పెళ్లి. ఈ సమయంలోనే తండ్రి చేతిలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. హత్య తర్వాత పరారీలో ఉన్న నిందితుడు రంగలాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నారు.
Read Also: Inter Student: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Also Read
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్‌కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
గురువారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో పోలీసులకు హత్య గురించి ఫోన్ వచ్చింది. సంఘటనా స్థలంలోకి వెళ్లే సరికి రక్తపుమడుగులో బాధితుడు పడి ఉన్నాడు. అతడి ముఖం, ఛాతిపై 15 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ, ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. హత్య తర్వాత మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
గౌరవ్ పెళ్లి వేడుకు గురువారం జరగాల్సి ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే గౌరవ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించాడనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ విషయమై గౌరవ్ తన తండ్రితో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే గౌరవ్ తన తండ్రిని చెప్పుతో కొట్టాడని తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రంగలాల్ తన ముగ్గురు సహచరులతో కలిసి గౌరవ్‌ని హత్య చేసి రూ. 50 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన బంగారంతో ఇంటి నుంచి పారిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?