UP Love Tragedy: నా జీవితాన్ని నాశనం చేసింది.. నా చావుకి ప్రియురాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B Pharmacy Student Commits Suicide By After Sharing Girlfriend Photo: ఉత్తరప్రదేశ్‌లోకి కౌశాంబి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి వల్ల మనస్తాపానికి గురైన బి.ఫార్మసి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో అతడు ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా.. అతడు ఫేస్‌బుక్‌లో తన ప్రియురాలి ఫోటోని షేర్ చేసి, తన మరణానికి ఆ యువతే కారణమని పోస్ట్ పెట్టాడు. ఈ యువకుడి ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, అతని మృతదేహాన్ని అదుపులోకి తీసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు చవాకులు పేలకండి.. చిరు వార్నింగ్
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
మొహబ్బత్‌పూర్ పైసా పోలీస్ స్టేషన్ పరిధిలోని కైమా గ్రామంలో ఛోటే లాల్ యాదవ్ అనే రైతు ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు ఢిల్లీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. కూతురికి ఏడాది క్రితమే వివాహమైంది. చిన్న కుమారుడు రాహుల్ యాదవ్ (22) సిరతులోని ఓ కళాశాలలో బీ.ఫార్మసీ చదువుతున్నాడు. తన చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కొవిడ్ కాలంలో రాహుల్ సిరతులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కొవిడ్ ఆపరేటర్ (కాంట్రాక్ట్)గా పని చేశాడు. ఈ క్రమంలో అతనికి సీహెచ్‌సీలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎం(మహిళ)తో పరిచయం అయ్యింది. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారింది. వీళ్లు ప్రేమ వ్యవహారం మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. వీరి మధ్య దూరం పెరిగింది.
WTC Final: WTC ఫైనల్‌లో భారత్ గెలిస్తే.. ఆ ఘనత సాధించిన తొలిజట్టుగా సరికొత్త చరిత్ర
కట్ చేస్తే.. శనివారం ఉదయం రాహుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన జీవితాన్ని నాశనం చేసిందని, తన చావుకి ప్రియురాలే కారణమంటూ.. అతడు సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తాము ఆధారాలు సేకరించి, చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాహుల్ సూసైడ్ చేసుకునేంతలా.. వారి మధ్య ఏం జరిగి ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!