Delhi : దారుణం..బాలికపై టీచర్ లైంగిక దాడి.. చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు సమాజంలో ఎక్కడ రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు ఆడవాళ్ల పై తగ్గడం లేదు.. పోలీసులు ఇలాంటి ఘటనల పై కఠినంగా వ్యవరిస్తున్న మృగాల్లో మార్పులు రావడం లేదు..ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. ఇప్పుడు చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది..తాజాగా ఓ పదేళ్ల బాలికపై ఓ ట్యూషన్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది..
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని 30 ఏళ్ల వ్యక్తి ప్రైవేటుగా ట్యూషన్ క్లాసులు చెబుతున్నారు. అతడి వద్దకు స్థానికంగా నివసించే పదేళ్ల బాలిక 15 రోజుల నుంచి ట్యూషన్ కు వెళ్తోంది. ప్రతీ రోజు ఆ బాలికతో పాటు మరి కొందరు విద్యార్థినులు ట్యూషన్ కు వస్తుంటారు. అయితే శనివారం సాయంత్రం కూడా ఎప్పటిలాగే ఆ బాలిక ట్యూషన్ కు వెళ్లింది.. కానీ ఆ రోజు మిగితా పిల్లలెవరూ ట్యూషన్ కు రాలేదు. అయితే బాలిక ఒంటరిగా ఉందని గమనించిన ఆ టీచర్ కు దుర్భుద్ధి కలిగింది. వెంటనే ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. కొంత సమయం తరువాత బాలిక తన ఇంటికి వచ్చింది. తరువాత తల్లిదండ్రులకు తనపై ట్యూషన్ టీచర్ చేసిన దారుణాన్ని చెప్పి ఏడ్చింది..
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి దండ్రులు షాక్ అయ్యారు.. అదే రోజు సాయంత్రం సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూతురుపై జరిగిన లైంగిక దాడిని వివరిస్తూ, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) అమృత గుగులోత్ ఆదివారం వెల్లడించారు. మైనర్ ను కౌన్సిలింగ్, వైద్య పరీక్షలకు పంపినట్లు గుగులోత్ తెలిపారు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షనలతో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!