ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అధికారులు షాకయ్యారు. ఎందుకంటే ఆ మహిళ దాదాపు.. 997.5 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వారు గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి జరిపిన ఆపరేషన్‌లో లక్షల విలువైన బంగారాన్ని కనుగొన్నారు.
Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
కస్టమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ యాంగోన్ నుండి విమానం నంబర్ 8M 620 ద్వారా ఢిల్లీలో దిగింది. అక్రమంగా బంగారం దాచిపెట్టి… ప్రయాణీకులకు రిజర్వ్ చేయబడిన గ్రీన్ ఛానల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆమె అనుమానస్పదంగా ప్రవర్తించడంతో.. అధికారులు ఆమెను గుర్తించి పట్టుకున్నారు. ఆమె లోదుస్తులలో దాచిపెట్టిన ఆరు బంగారు బిస్కెట్లను అధికారులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం బరువు దాదాపు ఒక కిలోగ్రాము ఉన్నట్లు గుర్తించారు. . కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. ఆమెపై పలు కేసులు నమోదు చేశారు. కస్టమ్స్ చట్టం ప్రకారం, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ప్రకటించని విధంగా కలిగి ఉండటం లేదా సరిహద్దు దాటి రవాణా చేయడం తీవ్రమైన నేరమని అధికారులు తెలిపారు. ఆ మహిళ పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమైందా లేదా అని నిర్ధారించడానికి ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.
Read Also:Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…
ఢిల్లీ కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న విషయాన్ని ధృవీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.. తిరిగి వచ్చే ప్రయాణికులు వచ్చిన తర్వాత విలువైన లోహాలు లేదా అధిక విలువైన వస్తువులను ప్రకటించాలని అధికారులు కోరారు. వాటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.