Srishti Tuli: మహిళా పైలట్ మృతి వెనుక మరో మహిళ.. ఆమె ఎవరంటే..!
- మహిళా పైలట్ మృతి వెనుక మరో మహిళ
- సృష్టి తులిని చంపిన ప్రియుడు ఆదిత్య.. మరో ప్రియురాలు!
- బాధిత కుటుంబం ఆరోపణ.. పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమెది చిన్న వయసు. కానీ ఆమె ఎంతో మందికి స్ఫూర్తి. కారణం.. చిన్న వయసులోనే మహిళా పైలట్‌గా ఎన్నికై.. తన వెనుకున్న వారికి ఆదర్శంగా నిలిచింది. ఆమె పది మందికి ఆదర్శంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రే స్వయంగా ఆమెను సత్కరించారు. కానీ ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇదంతా ఎవరి కోసమో అర్థమై ఉంటుంది. సోమవారం ముంబైలో శవమైన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి గురించి. ఆమె మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె చనిపోక ముందు వరకు ఉల్లాసంగా.. సంతోషంగా తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడింది. కానీ అంతలోనే ఆమె మరణవార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన సృష్టి తులి (25), ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్ (27) దేశ రాజధానిలో పైలట్ శిక్షణ కేంద్రంలో కలుసుకున్నారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే సృష్టి తులి పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని ఎయిరిండియాలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగ రీత్యా ముంబైకి వచ్చి నివాసం ఉంటుంది. ఇక ఆదిత్య మాత్రం శిక్షణ పూర్తి కాకుండానే డ్రాప్ అయ్యాడు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. కానీ సృష్టి తులితో మాత్రం లవ్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఆదిత్యను ఇష్టపడుతుంది.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
అయితే సృష్టి తులిని మొదటి నుంచి మానసికంగా, శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడు. ఒకసారి పార్టీలో సృష్టి తులి నాన్ వెజ్ ఫుడ్ తిందని ఘోరంగా ఆమెను దుర్భాషలాడాడు. అంతేకాకుండా పలుమార్లు మార్గమధ్యలోనే కారు దింపేసి క్రూరంగా వేధించాడు. ఇవన్నీ అతడి మీద ఇష్టంతో భరిస్తూ వచ్చింది. అయితే ఆదిత్య ఈ మధ్య.. సృష్టి తులిని కాకుండా మరో మహిళా పైలట్‌తో కూడా ఎఫైర్ నడిపిస్తున్నాడు. ఈ విషయంలో ఆదిత్య-సృష్టి తులి మధ్య చాలా రోజులుగా గొడవలు.. కొట్లాటలు జరుగుతున్నాయి. ఇక సృష్టి తులి నుంచి కూడా భారీగా నగదు కాజేసినట్లు సమాచారం. గత నెల ఎస్‌బీఐ బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలించగా.. రూ.65,000 ఆదిత్య ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఇలా ఆమెను మానసికంగా వేధించడమే కాకుండా.. ఆమె నగదు వాడుకున్నట్లుగా బాధితురాలి కుటుంబ సభ్యులు గుర్తించారు.
సోమవారం అర్ధరాత్రి ఆదిత్య-సృష్టి తులి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆదిత్య కారులో వెళ్లిపోతుండగా… తులి ఫోన్ చేసి చనిపోతున్నట్లు బెదిరించింది. వెంటనే తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ తలుపులు వేసి ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆదిత్య వెంట మరో మహిళ ఉన్నట్లుగా సమాచారం. ఆమె సహాయంతోనే తలుపులు పగలగొట్టి.. సృష్టి తులిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మరణవార్తను సృష్టి తులి బంధువులకు ఆదిత్య అందించాడు. దీంతో వారంతా షాక్ అయ్యారు. ఆమె చనిపోక ముందే కుటుంబ సభ్యులతో తులి ఫోన్లో మాట్లాడింది. అప్పుడు ఎలాంటి ఆందోళన గానీ.. ఎలాంటి టెన్షన్ గానీ కనిపించలేదు. ఎప్పటిలాగే మాట్లాడింది. ప్రియుడి ఫోన్ చేసి మరణవార్త చెప్పడంపై బాధిత కుటుంబ సభ్యులకు అనుమానం రేకెత్తింది. ఆదిత్యనే తమ బిడ్డను చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే రూమ్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆదిత్య.. మరో మహిళతో కలిసి సృష్టి తులిని చంపేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..