Shocking Crime: మిల్క్ షేక్‌లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..
- మిల్క్‌షేక్‌తో తండ్రిని చంపిన కూతురు..
- లవ్ ఎఫైర్‌కు ఒప్పుకోకపోవడంతో హత్య..
- మూడేళ్ల తర్వాత బయటపడ్డ నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Crime: మహారాష్ట్రలో తండ్రిని హత్య చేసిన నేరం వెలుగులోకి వచ్చింది. చంద్రపూర్ జిల్లాలో సొంత కూతురే తండ్రిని విషం పెట్టి హత్య చేసింది. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఈ హత్య బయటకు వచ్చింది. ఈ కేసులో మాస్టర్ మైండ్ కూతురే అని పోలీసులు గుర్తించారు. ప్రియుడి సహాయంతో ఈ హత్యకు సదరు యువతి ప్లాన్ కేసింది. తండ్రికి మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చి చంపేసింది. దీనిని ముందుగా సహజ మరణంగా నిందితులు ప్లాన్ చేశారు. మూడేళ్ల తర్వాత, ప్రియుడే ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
మృతుడు జయంత్ బల్లవార్ అనే వ్యక్తి పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుతురు ఆర్య కూడా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తుంది. ఆర్యకు ఆశిష్ మహేష్ షెడ్మాకేతో ప్రేమ సంబంధం ఉంది. ఈ ప్రేమను జయంత్ బల్లవార్ తీవ్రంగా వ్యతిరేకించడంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. 2023 ఏప్రిల్ 24న ఇద్దరు కలిసి తండ్రి హత్యకు ప్లాన్ చేశారు. చైతన్య అలియాస్ మాంటీ ద్వారా రూ. 5000లకు విషం కొనుగోలు చేశారు. మిల్క్ షేక్‌లో కలిపి తండ్రికి ఇచ్చి హత్య చేసింది. విషం తాగిన కొద్దిసేపటికే అస్వస్థతలో ఆస్పత్రిలో చేరిన జయంత్, కొద్దిసేపటికే మరణించాడు.
ముందుగా ఈ మరణాన్ని సహజమరణంగా పోలీసులు నమోదు చేశారు. నిందితురాలు ఆర్య తప్పుడు సమాచారం ఇచ్చింది. దీంతో కేసు అక్కడే ఆగిపోయింది. ఆర్య, ఆమె ప్రియుడు కొంతకాలం కలిసి జీవించారు. మూడేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2026 మార్చి 23 ఆశిష్ పోలీసుల ముందు అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ కేసులో ఆర్య, ఆశిష్, చైతన్యలతో పాటు ఒక మైనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?