Cyber Attack : సైబర్ నేరగాళ్లు తమ పన్నాగాలను కొత్త పంథాలో కొనసాగిస్తున్నారు. ఈసారి వారు నేరుగా WhatsApp గ్రూపులను లక్ష్యంగా చేసుకుని జాగ్రత్తలేని వినియోగదారులను తమ బారిన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సైబర్ భద్రత అధికారులు చేసిన హెచ్చరికల ప్రకారం, SBI APK పేరుతో అనుమానాస్పద ఫైళ్లు, PDFలు, లింకులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఫైళ్లను WhatsApp గ్రూపుల్లో ఉద్దేశపూర్వకంగా పంపిస్తూ, వాటిని ఓపెన్ చేస్తే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా వంటి సున్నితమైన వివరాలు పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. బ్యాంకులు, ముఖ్యంగా SBI పేరును దుర్వినియోగం చేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని దోపిడీ చేయడమే ఈ మోసపు ఉద్దేశమని అధికారులు తెలిపారు.
PM Modi – Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..
సైబర్ సెల్ అధికారులు స్పందిస్తూ.. “భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తత మాత్రం అత్యవసరం” అని స్పష్టం చేశారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫైళ్లు, PDFలు లేదా లింకులను అస్సలు ఓపెన్ చేయకూడదని ప్రజలను హెచ్చరించారు. WhatsApp గ్రూపుల్లోకి వచ్చే ఎలాంటి ‘SBI APK’, ‘SBI Update File’ వంటి పేర్లతో ఉన్న ఫైళ్లను వెంటనే డిలీట్ చేయాలని సూచించారు.
డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని, ప్రతి వినియోగదారు సైబర్ భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, తెలియని ఫైళ్ల విషయంలో ‘ఓపెన్ చేయకపోవడమే’ మొట్టమొదటి భద్రతా చర్య అని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు SBI పేరును ఉపయోగించి WhatsApp గ్రూపులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తతతో వ్యవహరించాలని సైబర్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
‘Raju Weds Rambayi’ : కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’- డే 2 కలెక్షన్స్