Cyber Fraud : 80 ఏళ్ల వృద్ధుడి నుంచి 8.7 కోట్ల మోసం.. షార్వీ పేరిట సైబర్ క్రిమినల్స్ పనితీరు
- వృద్ధుడికి 2023లో షార్వీ అనే మహిళతో పరిచయం
- ఒంటరిగా ఉంటున్నానని వలపు వల విసిరిన షార్వీ
- మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురితో వ్యవహారం నడుపుతూ పెద్దాయన ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ ఆనందంలో ఆ ఇద్దరు అడిగినంత డబ్బులు పంపిస్తూ వెళ్లాడు. అయితే అతడి కుటుంబసభ్యులు డబ్బులు ఏమయ్యాయని నిలదీయడంతో అతడు చేస్తున్న యవ్వారం బయటపడింది. కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాళ్ల మోసం వెలుగులోకి వచ్చింది. అలా రంగంలోకి దిగిన సైబర్ కేటుగాళ్లకు అప్పుడప్పుడు బాగానే గిట్టుబాటు అవుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ వృద్ధున్ని ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్స్.. అతని వద్ద నుంచి ఏకంగా 8.7 కోట్ల రూపాయలు లాగేశారు..
Tollywood : నిర్మాతల నిర్ణయం అంగీకరించట్లేదు.. రేపు ఫెడరేషన్ నిరసన
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ముంబైకి చెందిన వృద్ధునికి 2023లో షార్వీ అనే మహిళతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వీరిద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ‘భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నా’ అని వృద్ధుడిని షార్వీ నమ్మించి వలపు వల విసిరింది. ఈక్రమంలోనే అతడికి మాయమాటలు చెప్పి అప్పుడు ఇప్పుడు అంటూ డబ్బు వసూలు చేసింది…
కొన్నాళ్లకు షార్వీ స్నేహితురాలినంటూ కవిత అనే పేరుతో మరొకరు సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యారు. ఆమెతో కూడా వృద్ధుడు స్నేహంగా ఉంటూ.. ఆనందం పొందుతున్నాడు. ఈమె కూడా అడిగినప్పుడల్లా డబ్బులు పంపేవాడు. వృద్ధుడి ఆసక్తినే పెట్టుబడిగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు తర్వాత షార్వీ చనిపోయిందని ఆమె చెల్లెలు దినాజ్ పేరిట మరొకరు వృద్ధుడికి సందేశాలు పంపారు. షార్వీ చనిపోయిందని చెప్పి.. ఆమెకు సంబంధించిన ఆస్పత్రి బిల్లులు కట్టాలంటూ తప్పుడు ఆధారాలు చూపించి అతడి నుంచి మరికొంత డబ్బులు కాజేశారు. అయితే పంపిన డబ్బులను కొన్నాళ్లకు తిరిగివ్వాలని వృద్ధుడు వారిని కోరాడు. ఇక అప్పుడు అటువైపు వాళ్లు బెదిరింపులకు పాల్పడడం స్టార్ట్ చేశారు. డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు…
ఇంత జరిగినా వృద్ధుడిలో మార్పు రాలేదు. అతడి బలహీనతను అడ్డం పెట్టుకున్న సైబర్ నేరగాళ్లు.. దినాజ్ ఫ్రెండ్ జాస్మిన్ అంటూ మరొకరు సందేశాలు పంపారు. ఆమెతో కూడా 80 ఏళ్ల వృద్ధుడు సన్నిహితంగా కొనసాగాడు. వారి మాయ మాటల బుట్టలో చిక్కుకున్న అతడు అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తూ వచ్చాడు. ఇలా పంపిస్తూ 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆ పెద్దాయన దాదాపు 734 సార్లు డబ్బులు పంపారు. వారికి డబ్బులు చెల్లించేందుకు కొన్నిచోట్ల అప్పు కూడా చేసినట్లు సమాచారం..
ఈలోపు వృద్ధుడి నివాసంలో డబ్బు విషయమై ప్రస్తావన వచ్చింది. డబ్బులు ఏమయ్యాయని కుటుంబసభ్యులు నిలదీయడంతో ఆయన తెల్లముఖం వేశారు. జరిగిన మొత్తం విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వాళ్లు నివ్వెరపోయారు. సైబర్ నేరగాళ్లు మోసం చేశారని గ్రహించిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా ఆ పెద్దాయన మొత్తం రూ.8.7 కోట్లు మోసపోయాడని గుర్తించారు… పోలీసుల విచారణలో తేల్చిన వాస్తవాలు తెలుసుకున్న అనంతరం 80 ఏళ్ల వృద్ధుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇదంతా సైబర్ మోసం అని తెలుసుకున్న బాధితుడు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత అవగాహన కల్పించినా సోషల్ మీడియా పరిచయస్తులను నమ్మి పెద్ద ఎత్తున బాధితులు మోసాల బారిన పడుతున్నారు…
Pulivendula ZPTC By Elections: 30 ఏళ్లుగా ఏకగ్రీవం.. ఆసక్తికరంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక..
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!