iPhone: గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు అమ్మ నగలు చోరీ.. 9వ తరగతి విద్యార్థి నిర్వాకం..
- గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ గిఫ్టుగా ఇచ్చేందుకు బాలుడి నిర్వాకం..
- తల్లి నగలు చోరీ చేసి..ఫోన్ కొనుగోలు..
- 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దొంగతనం చేసినట్లు బాలుడి తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన తర్వాత బాలుడే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.
నిందితుడు తన తల్లి బంగారు చెవిపోగులు, బంగారు ఉంగరం, బంగారు గొలుసుని చోరీ చేసి కక్రోలా ప్రాంతంలోని ఇద్దరు స్వర్ణకారులకు విక్రయించాడు. బాలిక కోసం హై-ఎండ్ ఫోన్‌ని కొనుగోలు చేశాడు. బాలుడు, బాలిక ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కమల్ వర్మ అనే 40 ఏళ్ల స్వర్ణకారుడిని పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఉంగరం, చెవిపోగులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
Read Also: Illegal Constructions: లేవుట్ భూముల్లోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది..
‘‘ఆగస్టు 3న మహిళ ఇంట్లో చోరీ జరిగింది. అందులో ఆమె తన ఇంట్లోని రెండు బంగారు గొలుసులు, ఒక జత బంగారు చెవిపోగులు మరియు ఒక బంగారు ఉంగరాన్ని ఆగస్టు 2న ఉదయం 8 నుండి 3 గంటల మధ్య గుర్తుతెలియని వ్యక్తి అపహరించినట్లు ఫిర్యాదు చేసింది.’’ అని డీసీపీ(ద్వారక) అంకిత్ సింగ్ చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారి తెలిపారు. క్రైమ్ సీన్ సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేశారు. అయితే, చోరీ జరిగిన ఇంటి సమీపంలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులు కనుగొనలేదు. సమీప ప్రాంతాల్లో ప్రజల్ని ఎంక్వైరీ చేసినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు.
ఇంటి దొంగల పనే అని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. చోరీ జరిగినప్పటి నుంచి మహిళ కుమారుడు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. అతడి స్కూల్‌లో స్నేహితులను ప్రశ్నించారు. రూ. 50,000 విలువైన ఐఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధర్మపుర, కక్రోలా, నజఫ్‌గఢ్‌లో సోదాలు నిర్వహించారు. ప్రతీసారి బాలుడు తప్పించుకోగలిగాడు. చివరకు అతని ఇంటికే వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు.
సెర్చ్ చేస్తే అతని వద్ద నుంచి ఆపిల్ మొబైల్‌ని గుర్తించారు. దర్యాప్తు చేయగా దొంగిలిచించిన బంగారాన్ని ఇద్దరు స్వర్ణకారులకు అమ్మినట్లు బాలుడు చెప్పాడు. తాను 9వ తరగతి చదువుతున్నాని, తన తండ్రి అనారోగ్యంతో మరణించినట్లు పోలీసులకు బాలుడు వెళ్లడించాడు. తనకు చదువుపై ఆసక్తి లేదని బాలనేరస్తుడు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. అదే తరగతిలో చదువుతున్న బాలికతో అతడికి సంబంధం ఉన్నట్లు అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు. తన ప్రియురాలి పుట్టిన రోజుకు గిఫ్ట్ ఇవ్వాలని చెబితే అతడి తల్లి తిరస్కరిచండంతో డబ్బు కోసం నగులు దొంగిలించినట్లు చెప్పాడని డీసీపీ చెప్పారు.
తాజావార్తలు
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!