Road Accident: గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలోని మల్పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం యాత్రికులపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న బనస్కాంత జిల్లాలోని అంబాజీ పట్టణంలోని అంబాజీ దేవాలయం వైపు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆరావళి జిల్లాలోని మల్పూర్ సమీపంలోని కృష్ణపూర్ పాటియా సమీపంలో కారు డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
Assam: నెలలు నిండకముందే గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపలపెట్టి కుట్లు
ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడినట్లు సమాచారం. బాధితులను అంబులెన్స్‌లో మోదాసా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మృతులకు ఒక్కొక్కరికి సీఎం సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆరావళి జిల్లా కలెక్టర్‌ను కోరారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.