హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నేరాలు ఘోరాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా శేరిలింగంపల్లి సమీపంలోని తెల్లాపూర్ లో దారుణం జరిగింది. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి కనపడకుండా పోయిన కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కడవత్ రాజు బంధువుల్ని…