NTV Telugu Site icon

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

Personal Loan Harikrishna

Personal Loan Harikrishna

Boy Commits Suicide Due To Loan Apps Harassment In East Godavari: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. వీరి వేధింపులు తాళలేక మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడు బలి అయ్యాడు. తాను తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ మొత్తం తిరిగిచ్చినా.. లోన్ యాప్ నిర్వాహకులు ఆ యువకుడ్ని హింసించారు. అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చూడమని కోరినందుకు వ్యక్తిపై దాడి

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం గ్రామానికి చెందిన సురకాసుల శ్రీను దర్జీకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడైన హరికృష్ణ (18) ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరి 28న తన వ్యక్తిగత అవసరాల కోసం.. ఆన్‌లైన్‌లో హరి కొన్ని యాప్స్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఒక యాప్ లోన్ తీర్చేందుకు మరొక యాప్ నుంచి డబ్బులు తీసుకుంటూ వచ్చాడు. అనంతరం రూ.1.50 లక్షలను యాప్‌లకు చెల్లించాడు. అయినా సరే.. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు ఆడలేదు. వాళ్లు అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ, అతడ్ని దారుణంగా వేధించారు. దాంతో ఆ అబ్బాయి పోలీసుల్ని ఆశ్రయించాడు. వాళ్లు రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వడంతో.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాత్కాలికంగా నిలిచాయి.

Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సెకండ్ యంగెస్ట్ ప్లేయర్

హరికృష్ణ మరోసారి తన తండ్రి పేరు మీద లోన్ తీసుకోవాలని భావించాడు. శనివారం సాయంత్రం షాపులో పనిచేసుకుంటున్న తండ్రిని ఇంటికి పిలిచి, తండ్రి ఫోటోను తీసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి తండ్రి వెళ్లిపోయాడు. ఇంతలో పెద్ద కుమారుడు కార్తీక్‌ వచ్చి.. తమ్ముడు ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడని చెప్పాడు. తండ్రి ఇంటికొచ్చి అతడ్ని ఫోన్‌ను పరిశీలించగా.. అందులో హరికృష్ణ తల భాగంతో నగ్న చిత్రాలు, అసభ్య పదజాలంతో వాట్సప్‌లో మెసేజ్‌లు ఉండటాన్ని చూశాడు. అది చూసి తట్టుకోలేక హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.