మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ఓ మహిళ గడ్డి కత్తిరిస్తుండగా.. అందులో చిక్కుకుని పాము ముక్కలైంది. అయితే తలభాగం మాత్రం గడ్డి కత్తిరించిన యువతిని కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్తరికి తీసకెళ్లకుండా.. నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Read Also:Gujarat Tourists:హోటల్ లో ఎంజాయ్ చేసి.. బిల్ కట్టకుండా జంప్
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లా సబల్‌గఢ్ పట్టణ సమీప గ్రామంలో పాము కాటేసి భర్తి కుశ్వాహా అనే యువతి మృతిచెందింది. ఇంటి ముందున్న గడ్డిని యంత్రంతో కత్తిరిస్తుండగా ఆ గడ్డిలో పడుకొని ఉన్న పామును అనుకోకుండా కత్తిరించింది. ఈ ఘటనలో గడ్డితోపాటు పాము మూడు ముక్కలైంది. అయితే పాము తలభాగం యువతిని కాటేసింది. కుటుంబసభ్యులు ముందు నాటువైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… నాటు వైద్యాన్ని నమ్మవద్దని.. ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని తెలిపారు.