Exam Chit Took Boys Life: పరీక్ష చిట్టీని లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి.. బాలుడి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Boy Killed By Brothers Of Girl Who Mistook Exam Chit For Love Letter: బీహార్‌లో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ పరీక్ష చిట్టీ ఒక బాలుడి ప్రాణాల్ని బలిగొంది. తన అక్కకు సహాయం చేద్దామని పరీక్ష చిట్టీ విసిరిన పాపానికి.. అతడు హత్యకు గురయ్యాడు. ఒక అమ్మాయి ఆ పరీక్ష చిట్టీని లవ్ లెటర్‌గా పొరబడటం వల్లే.. ఈ విషాదం చోటు చేసుకుంది. గత వారం భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఆ ఘటన ఆ వివరాల్లోకి వెళ్తే..
ఉద్వంత్ నగర్‌కు చెందిన దయాకుమార్ (12) అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. గత వారం ఆరవ తరగతి చదువుతున్న తన సోదరిని పరీక్ష నిమిత్తం.. పరీక్ష కేంద్రం వద్ద డ్రాప్ చేశాడు. సోదరి సరిగ్గా చదవకపోవడంతో, ఆమెకు సహాయం చేయాలని అనుకున్నాడు. ఆమె పరీక్ష రాస్తుండగా.. ఒక చిట్టీని ఎగ్జామ్ హాల్‌లో విసిరాడు. అయితే.. ఆ చిట్టీ మరో అమ్మాయి వద్ద పడింది. ఆ అమ్మాయి మాత్రం దాన్ని ప్రేమలేఖగా పొరబడింది. తన సోదరులు స్కూల్ వద్దకు రాగానే.. ఆ చిట్టీ చూపిస్తూ, దయాకుమార్ తనకు ప్రేమలేఖ రాశాడని చెప్పింది. వాళ్లు కూడా ఆ చిట్టీలో ఏముందో చూడకుండానే.. తమ సోదరి మాట విని దయాకుమార్‌ను చితకబాదారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తాను రాసింది లవ్ లెటర్ కాదని.. అది కేవలం పరీక్ష చిట్టీ అని.. తన సోదరి కోసం విసిరిన ఆ చిట్టీ పొరపాటున మీ సోదరి వద్దకు చేరుకుందని చెప్తున్నా.. ఆ ఇద్దరు పట్టించుకోకుండా ఘోరంగా కొట్టారు. ఆపై అతడ్ని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురించి దయాకుమార్ సోదరి తన కుటుంబ సభ్యులు తెలిపింది. వాళ్లు అతని కోసం గాలించడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. కట్ చేస్తే.. నాలుగు రోజుల తర్వాత ఓ గ్రామస్తుడికి స్థానిక ఆలయం వద్ద తెగిపడి ఉన్న చెయ్యి కనిపించింది. అతడు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టి, మిగతా భాగాల్ని వెతికిపట్టారు.
అనంతరం.. కుటుంబ సభ్యుల్ని పిలిపించి, ఆ భాగాలను చూపించగా.. అవి తమ దయాకుమార్ మృతదేహమేనని వాళ్లు ధృవీకరించారు. దీంతో అతడు హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ హత్యకు పాల్పడినట్టుగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరు బాలురు కూడా ఉండటం గమనార్హం. ఆ చిట్టీని అప్పుడే తెరిచి చూసి ఉంటే, ఇంత ఘోరం జరిగేది కదా!
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!