Bengaluru: వంట విషయంలో అత్తతో గొడవ.. టెక్కీ ఆత్మహత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: టెక్ సిటీ బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేవలం వంట చేసే విషయంలో అత్తతో జరిగిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన నితీష్ కుమార్ (31) బెంగళూరులోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అతను తన భార్య, అత్తతో కలిసి నగరంలోని HSR లేఅవుట్ పరిధిలో నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో వంట చేసే విధానం, రుచికి సంబంధించి నితీష్‌కు, అతని అత్తకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
సంఘటన జరిగిన రోజు కూడా భోజనం విషయంలో నితీష్, అతని అత్త మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన నితీష్, తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. నితీష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణలో కేవలం వంట విషయంలో జరిగిన గొడవే ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తెలుస్తోంది. నితీష్ మరణంపై అతని కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!