Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తమ అత్యుత్తమ ర్యాంక్‌ను కైవసం చేసుకుని 6వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకను అధిగమించి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2009లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్, చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ క్రికెట్లో బలమైన జట్టుగా ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గడిచిన కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక వంటి మాజీ ఛాంపియన్లను ఓడించడమే కాకుండా, 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా సెమీఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఆడిన 191 వన్డే మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్ 96 విజయాలు సాధించింది.
Also Read
- Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
- November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
- WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
వెస్టిండీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వంటి దిగ్గజ జట్ల కంటే ముందే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు శ్రీలంకను కూడా వెనక్కి నెట్టి ఆరో స్థానానికి ఎగబాకింది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 4-0తో గెలుచుకోవడంతో పాటు, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై-సిరీస్‌లో ఓటమి లేకుండా విజేతగా నిలవడం ఈ ర్యాంకింగ్స్‌లో కలిసి వచ్చింది.
అంతేకాకుండా.. జింబాబ్వేపై జరిగిన టీ20 సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పుడు జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. క్రమశిక్షణ, అంకితభావంతో ఆడుతూ పటిష్టమైన జట్లకు సవాలు విసురుతున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు సాధించిన ఈ ఆరో ర్యాంక్, ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
-
Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
-
November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!