Professor Harassment: ప్రస్తుత సమాజంలో మహిళకు రక్షణ లేదు.. ఎటు చూసినా కామాంధులే.. బంధువులను నమ్మలేము.. బడి పంతులను నమ్మలేం.. అన్న ను నమ్మలేము చివరికి కన్న తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితి. సమాజంలో ఎలా బతకాలి..? మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పే ప్రొఫెసర్ సైతం కామాంధుడు గా మారితే ఆడపిల్లలు ఎక్కడి వెళ్లి చదువుకోవాలి అని అంటున్నారు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థినులు. అవును.. బాధ్యతా యుతమైన టీచర్ ఉద్యోగంలో ఉండి కూడా ఒక ప్రొఫెసర్ కామాంధుడు గా మారాడు. చదువు చెప్పాల్సిన విద్యార్థినులకు అశ్లీల వీడియోలను షేర్ చేసి వారిని లైంగికంగా వేధించాడు. ఈ ఘటన బెంగుళూరు లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో మధుసూదన్ అనే వ్యక్తి ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇక మొదటి నుంచి అతడు విద్యార్థినీలతో అసభ్యకరంగా మాట్లాడినా యాజమాన్యం అంతగా పట్టించుకోలేదు. అయితే ఇటీవలే విద్యార్థినిల ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో పోర్న్ వీడియోలను షేర్ చేసి వారిని లైంగికంగా వేధించాడు. దీంతో విద్యార్థినులు అతడిపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ వీడియో అనుకోకుండా సెండ్ అయ్యిందని, తను కావాలని పంపలేదని మధుసూదన్ చెప్పి బుకాయించాడు. అయితే అంతకుముందు మధుసూదన్ వేధించిన అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ తో అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త యూనివర్సిటీలో హాట్ టాపిక్ గా మారింది.