బెంగళూరులోని పబ్ టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను స్నేహితులతో కలిసి పబ్‌కి వెళ్లి భోజనం చేసిన తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. సీసీటీవీ ఫుటేజ్‌లో అతను లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసినట్లు కనిపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరి నగర్‌లోని ఒక పబ్‌లో 31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ మేఘరాజ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మేఘరాజ్ ముగ్గురు స్నేహితులతో కలిసి తినడానికి, తాగడానికి పబ్‌కి వెళ్లాడని పోలీసులు తెలిపారు. బిల్లు చెల్లించిన తర్వాత, వాంతులు చేసుకుంటున్నట్లు అనిపించడంతో వాష్‌రూమ్‌కి వెళ్లాడు. ఈ సమయంలో, అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతను చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో, వారు పబ్ సిబ్బందికి సమాచారం అందించారు. మేఘరాజ్ వాష్‌రూమ్‌కి వెళ్లి తలుపు లాక్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.
“కొంతసేపు వేచి ఉన్న తర్వాత, ముగ్గురు స్నేహితులు మేఘరాజ్ కోసం మళ్ళీ వెతుకుతూ పైకి వెళ్లారు. సీసీటీవీ చూసిన తర్వాత, అతను వాష్‌రూమ్‌కి వెళ్లి లోపల తాళం వేసుకున్నట్లు తేలింది. తలుపు పగలగొట్టి చూసేసరికి, అతను చనిపోయాడని తేలింది” అని డీసీపీ గిరీష్ తెలిపారు.
ఉద్యోగులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అతను లోపల అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మరణానికి అసలు కారణం పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే తెలుస్తుందని డీసీపీ వెల్లడించారు. మృతుడి సోదరుడు వినయ్ ఫిర్యాదు ఆధారంగా బిఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 174 (సి) కింద అసహజ మరణం కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని డిసిపి గిరీష్ తెలిపారు.
జూన్ 22, 2019న చర్చి స్ట్రీట్‌లోని బీర్ పబ్ కిటికీలోంచి మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తూ పడి మార్కెటింగ్ మేనేజర్ మరియు అతని మహిళా స్నేహితురాలు మరణించారు. మృతులను మీడియా హౌస్‌లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ అత్తవర్ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేద ఆర్ యాదవ్‌గా గుర్తించారు.