సాధారణంగా నవలలు ఎలా రాస్తారు.. వాస్తవ సంఘటనలకు కొద్దిగా కల్పనను జోడించి రాస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం భర్తను చంపాడమెలా అని నవల రాసిన ఏడేళ్లకు భర్తను చంపేసింది. ఈ దారుణ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ గురించి అమెరికా వాసులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భర్తలు విసిగిస్తే.. భార్యలు పోలీసులకు దొరక్కుండా అతడిని ఎలా చంపాలో విశ్లేషిస్తూ “హౌ టు మర్డర్ యువర్ హజ్బెండ్” అని నవల రాసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయింది. ఒకానొక సమయంలో ఆమె పుస్తకాల కోసం షాపులను కూడాధ్వంసం చేశారు మహిళలు.. ఇక అలాంటి రచయిత్రి ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటుంది. ఎందుకంటే.. ‘భర్తను చంపాడమెలా’ అని బుక్ రాసిన ఈమె స్వయంగా తన చేతులతో భర్తను అతి దారుణంగా హత్యచేసింది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్తను చంపినట్లు ఆమె అంగీకరించింది. అయితే బుక్ రాసిన ఏడేళ్లకు ఆమె భర్తను చంపడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో విశేషమేంటంటే ఆమె రాసిన బుక్ లో ఉన్నట్లే భర్తను హత్య చేయడం.. 2018 జూన్‌లో తన ఆఫీస్ గదిలో ఉన్న భర్త దగ్గరకు వెళ్లి అతడి గన్ తోనే కాల్చి వెళ్ళిపోయింది. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మూడు నెలల సమగ్ర విచారణ చేపట్టి ఎట్టకేలకు నాన్సీనే భర్తను చంపినట్లు తేల్చారు. 72 ఏళ్ల వయస్సులో ఆమె భర్తను చంపినట్లు ఒప్పుకోవడంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు జైలుకు తరలించారు. ఇక ఈ వార్తతో నిజంగానే పోలీసులకు దొరక్కుండా భర్తను చంపడం ఈమెను చూసి నేర్చుకోవాలి.. మూడు నెలలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.. భర్తను చంపి మరీ ‘భర్తను చంపాడమెలా’ అని బుక్ రాసిందా..? లేక ముందే అనుకోని ఆ ప్లాన్ ను బుక్ లో పెట్టిందో తెలియడం లేదే అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.