ఛీ.. దుర్మార్గుడా.. రూ.100 కోసం ఇంత దారుణం చేయాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని శాసించే పదునైన ఆయుధం.. డబ్బు. అందరు ఈ డబ్బు కోసమే పరితపిస్తుంటారు. ఇంకొంతమంది డబ్బు కోసం కక్కుర్తి పడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. కేవలం ఒక వంద రూపాయల కోసం కక్కుర్తిపడి ఒక వార్డు బాయ్ చేసిన నిర్వాకం ఒక చిన్నారి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా ఊపిరితిత్తులలో సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం బాలుడిని నిలోఫర్ హాస్పిటల్ లో తల్లిదండ్రులు చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేయాలనీ చెప్పారు. రోజుకు లక్ష చొప్పున రెండు రోజులకు రెండు లక్షలు బిల్లు అయ్యింది. అయినా బిడ్డ బతకాలని డబ్బు కోసం తండ్రి మహ్మద్ ఆజం తిరుగుతున్నాడు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఇక ఈనేపథ్యంలోనే బాలుడికి ఆక్సిజన్ పెట్టాలని వైద్యులు సూచించగా.. వార్డ్ బాయ్ సుభాష్ .. పక్క గదిలో వేరొక రోగి బంధువులు రూ. 100 ఇవ్వడంతో బాలుడికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ ని వేరొక రోగికి అమర్చాడు. దీంతో ఖాజా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న వైద్యులు వచ్చి పరీక్షించేలోపే బాలుడు మృతిచెందాడు. తమ బిడ్డ చావుకు కారణం వార్డ్ బాయ్, ఈ హాస్పిటలే నని తెలుపుతూ బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక బాలుడు ఘటనపై ఆస్పత్రి సూపర్డెంట్ సీరియస్ అయ్యారు. బాలుడు మృతికి కారణమైన వార్డ్ బాయ్ ని సస్పెండ్ చేశారు
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!