Site icon NTV Telugu

Araku M*urder: యువతి విషయంలో మొదలైన గొడవ.. చివరకి ప్రాణం బలి..!

Araku Murder

Araku Murder

Araku Murder: అతడికి ఇదివరకే పెళ్లయింది.. పండంటి కాపురానికి గుర్తుగా భార్య గర్భవతి అయింది.. కొద్ది రోజుల్లో పాపో, బాబో పుట్టబోతున్నడు. కానీ అతనికి ఉన్న పాడు అలవాటు ప్రాణల మీదకి తెచ్చింది. ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అల్లూరి జిల్లా అరకులో జరిగింది.

IPL 2026: గాయాల దెబ్బకు కొత్త ప్లేయర్లు, కొత్త ఆశలు.. KKR లోకి సైనీ, GT లోకి కేజ్రోలియా..!

ప్రశాంతంగా ఉండే అల్లూరి జిల్లా అరకు లోయ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో అత్యంత దారుణంగా మర్డర్ జరిగింది. ఓ యువతితో రిసార్ట్‌కు వచ్చిన యువకుడిని దారుణంగా హత్య చేశారు పోకిరీలు. యువతి విషయంలో మొదలైన గొడవ కాస్తా.. హత్యకు దారి తీసింది. ప్రశాంతమైన అరకులోయలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్నివలస గ్రామానికి చెందిన నాగెళ్ల సురేశ్‌ గా గుర్తించారు. అతనికి గతేడాది వివాహం జరిగింది. అతని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. గతంలో ఇదే అరకులో రిసార్టులో పని చేశాడు. కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌ లోని లలిత జ్యువెలరీ షాప్‌ లో ఉద్యోగానికి వెళ్లాడు.

సెలవు మీద హైదరాబాద్ నుంచి అరకు వచ్చిన సురేష్ తనతో పాటు ఓ యువతిని రిసార్ట్‌కు తీసుకొచ్చాడు. సదరు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు రిసార్ట్ వద్ద కొందరు పొకిరీ యువకులు. తాను తీసుకొచ్చిన యువతితో యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు సురేష్. దీంతో మాటామాటా పెరిగి సురేష్‌పై దాడికి దిగారు ప్రత్యర్ధులు. పిడి గుద్దులతో రెచ్చిపోయారు. హెల్మెట్‌ తో తలపై కొట్టారు. అనంతరం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా రిసార్టు ప్రాంతంలో అంతా ఉద్రిక్తంగా మారింది. మర్డర్ చేసిన తర్వాత యువకులు అక్కడి నుంచి పారిపోయారు.

Kailasa Temple Ellora: ప్రపంచమే ఆశ్చర్యపోయే ఏకశిలా క్షేత్రం.. ఒక్కసారైనా చూడాల్సిన కైలాస ధామం! ఎలా చేరుకోవాలో చూసేయండి..

రిసార్ట్ వద్ద హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సురేష్ డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. అలాగే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మర్డర్‌పై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version