Wife Kills Husband: భర్త ప్రాణాలను తన వివాహేతర సంబంధం కోసం భార్య బలితీసుకున్న ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్న (మృతుడు), కొండమ్మ దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గతేడాది ఈ దంపతులు కూలీ పనుల నిమిత్తం తెనాలి వెళ్లారు. అక్కడ పని చేసే చోట మేస్త్రీగా ఉన్న గణేశ్ అనే వ్యక్తితో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.
Love Cheating: ప్రేమ పేరుతో మోసం.. ఎస్సైకి పదేళ్ల జైలు శిక్ష..!
ఈ విషయం తెలుసుకున్న భర్త చిన్న.. భార్యను మందలించి స్వగ్రామానికి తీసుకువచ్చేశాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తరచూ ఫోన్ లో ప్రియుడితో మాట్లాడుతూ భర్తతో గొడవ పడేది. అయితే చివరకు తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని కొండమ్మ నిర్ణయించుకుంది. తన ప్రియుడు గణేశ్‌తో కలిసి హత్యకు ప్లాన్ వేసింది. పథకం ప్రకారం.. ఈ నెల 14న గణేశ్ తన బంధువు శివకుమార్‌తో కలిసి తెనాలి నుంచి చోడవరం చేరుకున్నాడు.
Nadendla Manohar: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలులో ఏపీ ట్రెండ్ సెట్.. 24 గంటల్లోనే నగదు జమ..!
చిన్న బైక్‌పై వస్తున్న సమయంలో నిందితులు అతడిని అడ్డగించి, తలపై తీవ్రంగా కొట్టి కిరాతకంగా చంపేశారు. అనంతరం అది రోడ్డు ప్రమాదంలో జరిగిన మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు. మొదట దీనిని రోడ్డు ప్రమాదంగా భావించి పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ.. మృతదేహంపై ఉన్న గాయాలు మరియు ఇతర ఆధారాలపై అనుమానం రావడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. జిల్లా డీఎస్పీ నేతృత్వంలో సాగిన విచారణలో భార్య కొండమ్మ కాల్ డేటా, నిందితుల కదలికల ఆధారంగా ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన హత్య అని తేలింది. నేడు ఈ ఘటన పై నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు అసలు విషయాన్ని వెల్లడించి.. నిందితులైన భార్య కొండమ్మ, ప్రియుడు గణేశ్, సహకరించిన శివకుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.