Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: రాజధాని అమరావతి రైతులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న వార్షిక కౌలు డబ్బులను కాజేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం రాజధాని ప్రాంత రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. రైతుల బ్యాంకు ఖాతాలనే లక్ష్యంగా చేసుకుని సైబర్ దొంగలు పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఫేక్ ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు.. రైతు కౌలు డబ్బులు మాయం
తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళా రైతు బ్యాంకు ఖాతా నుంచి కౌలు డబ్బులు మాయమయ్యాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిచి, రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ఘటనతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సైబర్ మోసాల వెనుక ఉత్తరప్రదేశ్‌లో మకాం వేసిన ముఠా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటి ద్వారా రైతుల కౌలు డబ్బులను మళ్లిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ముఠా మరికొందరు రైతులను కూడా లక్ష్యంగా చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Madurai Tanishq Robbery Case: తనిష్క్ దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. TVK–NTK మధ్య పొలిటికల్ వార్..!
- Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
- Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
- క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
మరికొందరు రైతుల ఖాతాల్లోనూ నగదు మాయం!
కోటేశ్వరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే తరహాలో మరికొందరు రాజధాని రైతుల బ్యాంకు ఖాతాల్లోనూ నగదు మాయమైనట్లు సమాచారం రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ మోసాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసు ఐటీ నిపుణులు రంగంలోకి దిగారు. జధాని రైతులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, నకిలీ ఆధార్ కార్డులు, నగదు బదిలీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐటీ నిపుణుల సహకారంతో సైబర్ నేరగాళ్ల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల కౌలు డబ్బులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మోసాలపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. వితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
-
Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
ట్రెండింగ్
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!