Site icon NTV Telugu

Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..

Crime News

Crime News

Death penalty: నాలుగేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో జరిగిన జంట హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను, ఆమె బంధువును హత్య చేసిన కేసులో భర్తతో పాటు అతని తండ్రి, సోదరుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున జరిమానా విధించింది.

Read Also: Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..

2022 ఆగ్రాలోని ఎత్మార్‌పూర్ ప్రాంతంలో అనుమానంతో భర్త ఆమె భార్య, బంధువునున హత్య చేశాడు. నిందితుడైన గౌరవ్‌కు సయ్యన్ ప్రాంతానికి చెందిన ఖిడియా గ్రామానికి చెందిన పూజతో వివాహం జరిగింది. బంధుత్వం కారణంగా 31 ఏళ్ల శివం సిసోడియా పూజ ఇంటికి తరుచూ వస్తుండేవాడు. అయితే.. పూజ, శివ చాలా సన్నిహితంగా ఉండటాన్ని చూసిన నిందిత కుటుంబం వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించింది.

2022 మే27న మధ్యాహ్నం పూజను కలవడానికి శివమ్ ఆమె ఇంటికి వెళ్లాడు. వీరిద్దరిని పట్టుకున్న కుటుంబం, ఇంటి బయటకు ఈడ్చుకొచ్చారు. గౌరవ్ అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్ కలిసి పూజ, శివంను కర్రలతో కొట్టారు. వీరిద్దరి గొంతు కోసి హత్య చేశారు. గౌరవ్ సోదరుడు శివంపై నిమిషంలోనే 22 సార్లు దాడి చేశాడు. హత్యల తర్వాత గౌరవ తన భార్య మృతదేహం వద్ద కూర్చుని ఏడ్చాడు. తండ్రి, సోదరుడు పోలీస్ స్టేషన్‌‌లో లొంగిపోయారు. ఈ కేసులో మొత్తం 14 మంది సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కోర్టు నిందితుల్ని దోషులుగా శిక్షించింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని నిందితులు పేర్కొన్నారు.

Exit mobile version