Agra: భార్య గుడికి.. తల్లి, కొడుకును హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారవేత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agra: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
ఒక బిజినెస్ డీల్‌లో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్నానని, అప్పులు చేశానని వ్యాపారవేత్త తరుణ్ చెబుతున్న వీడియో అతని మొబైల్ ఫోన్‌లో పోలీసులకు లభించింది. ఈ వీడియో ఆధారంగా తరుణ్ హత్యలు చేసి, ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాను తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానని తెలుసని, అయితే తాను చేయగలిగింది ఏమీ లేదని వీడియోలో పేర్కొన్నాడు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Read Also: Pushkar Singh Dhami: పోలీసులు సజీవ దహనానికి ప్రయత్నించారు.. వారిని వదిలిపెట్టేది లేదు..
హత్యల సమయంలో తరుణ్ భార్య రజనీ ఖాతు శ్యామ్ స్థానిక ఆలయంలో దేవుడి దర్శనానికి వెల్లింది. 15 ఏళ్ల క్రితం తరుణ్‌తో రజనీ వివాహం జరిగింది. డీసీపీ ఆగ్రా సూరజ్ కుమార్ మాట్లాడుతూ.. తరుణ్ మృతదేహం మొదటి అంతస్తులో ఉరేసుకున్న స్థితిలో లభించిందని, అతని తల్లి బ్రజేష్ దేవీ, 12 అతని కొడుకు 12 ఏళ్ల కుశాగ్రా గ్రౌండ్ ఫ్లోర్‌లో విగతజీవులుగా పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిద్దరిపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. వాంతులు, గోళ్ల రంగు నీలి కలర్‌లోకి మారాయి. తరుణ్ భార్యను కూడా చంపాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రజనీ అతని కోడలు గుంజన్‌తో కలిసి ఆలయానికి వెళ్లడంతో బతికిపోయింది. ఉదయం ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషి ముందుగా ఈ దారుణాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. తరుణ్ తండ్రి కొన్ని నెలల క్రితమే చనిపోయాడని డీసీపీ తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!