NTV Telugu Site icon

Nude Video Call: యువకుడికి న్యూడ్ కాల్ వేధింపులు.. పల్లెలను కూడా వదలడంలేదుగా..!

Nude Video Cal

Nude Video Cal

స్వీట్ వాయిస్.. హాట్ వీడియోస్.. ముగ్గులోకి దింపేంతగా ఊరిస్తారు. .కాస్త టెంమ్ట్ అయ్యారో బోక్కపడ్డట్టే.. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓయువకుడికి అందమైన అమ్మాయి డీపీతో ఉన్న నంబర్ నుంచి హాయ్ అంటూ మెసేజ్‌ వచ్చింది… కాస్త రిప్లై ఇచ్చాడు.. ఇక అంతే వీడియో కాల్ అది న్యూడ్ వీడియో… తేరుకునే లోపే బట్టలిప్పేస్తూ కనిపించడంతో యువకుడు షాక్‌కు గురైయ్యాడు.. అలా ఫోన్ కట్ చేశాడో లేదో.. ఇలా వాయిస్ మెసేజ్‌తో పాటు మరో ఫోన్ కాల్ వచ్చింది… నీ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తా.. సమయం ఇస్తున్నా… ఆలోపు ఇచ్చినంతా డబ్బులు ఇవ్వు.. లేదంటే అంతే అంటూ ఫోన్ కట్ చేశారు.. అలా హమ్మయ్యా అనుకునే లోపే తన ఫేస్ తో ఉన్న ఫోటో మార్ఫింగ్ చేసి మరో అమ్మాయితో న్యూడ్ గా ఉన్న ఫోటో వచ్చేసింది… ఇక అంతే..

Read Also: CPI 24th congress: మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజా.. తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే అవకాశం..

ఇలా ఫోటోలు లేదా న్యూడ్ వీడియోస్ తో మోసాలకు దిగుతున్నారు సైబర్ కేటుగాళ్లు… అయితే, కొంతమంది ఎవ్వరితో చెప్పులేక ఎంతో కొంత ఇచ్చి వదిలేసుకుంటున్నా.. కొంత మంది మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. మరి కొంతమంది మాత్రం.. ఏమవుతుందిలే అంటూ నంబర్ బ్లాక్ చేసి సైలెంట్ గా ఉంటున్నారు… ఇప్పటి వరకు సెల్ ఫోన్లకు మెసేజ్‌లు లేదంటే ఫోన్ చేసి ఓటిపీల పేరుతో సైబర్ వల వేసిన కేటుగాళ్లు ఇప్పుడు కాస్త రూట్ మార్చారు.. గతంలో జిల్లా అదికారి ఫోటోనే డీపీగా పెట్టి జిల్లాలోని అధికారులకు వరుసబెట్టి మెస్సెజ్ లు పెట్టేసారు… అలా కొంతమంది పోలీసులను ఆశ్రయిస్తే ఓ వైద్యుడు మోసపోయాడు… ఇక ఇవ్వన్ని బంద్ చేసి మోసగాళ్లు ఇప్పుడు హనీ ట్రాప్స్ తో చీటింగ్ చేస్తున్నారు.. అందులో భాగంగానే మెన్నీమధ్య ఓ వకీల్ కు సైతం ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఆగడాలు మొదలయ్యాయి.. అయితే తను పోలీసులను ఆశ్రయించడంతో అందులో నుంచి భయటపడ్డారు.. ఇప్పుడు తాజాగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో ఉండే ఓయువకుడికి న్యూడ్ కాల్స్ రావడం లోలోపల మదనపడుతున్నాడు.. ఇదే కాకుండా ఆ మధ్య కాలంలో కొమురం బీం జిల్లాలో చాలామందికి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి.. కొంతమంది సైబర్ వలలో చిక్కి ఇబ్బంది పడితే మరికొంతమంది బయటపడ్డారు.

ఉమ్మడి జిల్లాలో ఇటీవల భారీగా సైబర్ నేరాలు జరగ్గా కేసు నమోదు అయ్యాయి.. కేవలం ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో 22 సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.. మంచిర్యాల జిల్లాలో వరుసబెట్టి సైబర్ నేరాలు జరగుతుండగా పోలీసులు ఏకంగా యూత్ లో సైబర్ నేరాల పట్ల అవగాహనకల్పిస్తున్నారు.. డబ్బులు అడగడం కోసం కొత్త కొత్త ట్రిక్స్ ఫాలో అవుతున్నారని యువకులైనా ఎవ్వరైనా ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు.. డబ్బుల కోసం ఎవ్వరైనా ఎవ్వరి డీపీలతో చాట్ చేస్తే అనుమానం రాగానే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు… వాట్సాప్ చాటింగ్ లను నమ్మిమోస పోవద్దంటున్నారు.