Marriage Twist: ఎనిమిదేళ్ల కాపురం తర్వాత.. బిగ్ ట్విస్ట్.. ఆయన కాదు.. ఆమె..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Twist: ఎనిమిదేళ్లుగా ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలిచింది. ఇదిలా ఉండగా.. వారి జీవితంలో ఓ చేదు నిజం బయటకి రావడంతో అలజడి రేగింది. తన వద్ద భర్త దాచిన షాకింగ్ నిజం తెలియడంతో ఆ భార్య గుండె బద్దలైంది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయమేమిటంటే ఆమె భర్త అసలు పురుషుడే కాదన్న నిజం ఆమెను వణికిపోయేలా చేసింది. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ తన మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. మరో వివాహం చేసుకుంది. ఒక కూతురు ఉన్న ఆమె 2014లో ఢిల్లీలో పని చేసే విరాజ్ వర్దన్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో రెండో పెళ్లి చేసుకుంది.
2014 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని హనీమూన్‌కు కశ్మీర్‌కు కూడా వెళ్లారు.అయితే ఆమెను శారీరకంగా కలవకుండా చాలా కాలం పాటు దూరం పెడుతూనే వచ్చాడు. ఆమె విరాజ్‌ను ఒత్తిడి చేయడంతో.. గతంలో తనకు రష్యాలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందని.. తాను సంసార సుఖానికి పనికి రానని చెప్పాడు. ఓ మైనర్ సర్జరీ జరిగితే అంతా సెట్ అవుతుందని చెప్పాడు. దీంతో నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడని ఆమె అతన్ని క్షమించేసింది. ఆపై ఆ జంట అన్యోన్యంగానే ఉంటూ వచ్చింది.
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
Pakistan PM: పాకిస్తాన్ ప్రధాని అవస్థలు.. రష్యా అధ్యక్షుడి నవ్వులు!
జనవరి 2020లో, అతను తన బరువును తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పాడు.దాని కోసమని కోల్‌కతా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన విరాజ్ వర్దన్ తన భార్యతో శారీరకంగా కలవడం ప్రారంభించాడు. విరాజ్ కోల్‌కతాకు వెళ్లింది బరువు తగ్గే సర్జరీ కోసం కాదని.. పురుషుల అవయవాల మార్పిడి కోసం డాక్టర్ రిపోర్టుల ద్వారా తెలుసుకున్న ఆమెకు గుండె పగిలినంత పని అయ్యింది. అనంతరం భర్త చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
విజైతా అనే యువతి.. విరాజ్ వర్దన్‌గా పేరు మార్చుకుని.. మ్యాట్రిమోనియల్ సర్జరీ ద్వార తనను సంప్రదించిందని తెలియడంతో ఆమె తల తిరిగిపోయింది. విజైతా కుటుంబం తనను మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించింది. అతను తనతో అసహజంగా పాల్గొనడం ప్రారంభించాడని, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఢిల్లీ నివాసి అయిన నిందితుడిని వడోదరకు తీసుకువచ్చినట్లు గోత్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంకే గుర్జర్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!