Site icon NTV Telugu

Bengaluru Crime: ప్రియురాలితో శృంగారం చేస్తూ వ్యాపారవేత్త మృతి..

Romance

Romance

శృంగారం మనిషిలో ఉత్సాహాన్ని నింపుతుంది.. ఉత్తేజాన్ని కలిగిస్తోంది.. అంతే కాదు.. ప్రాణాలు కూడా తీస్తుంది.. ఎందుకంటే.. తన ప్రియురాలితో శృంగారం చేస్తూ ఓ వ్యాపారవేత్త మృతిచెందిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ ఘటనతో వణికిపోయిన ప్రియురాలు.. ఏం చేయాలో తోచక.. వెంటనే తన భర్త, సోదరుడికి సమాచారం ఇచ్చింది.. దీంతో, ఎవరికీ తెలియకుండా.. ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో కుక్కి.. పడవేశారు.. అయితే, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు మొదట ఎలాంటి క్లూ దొరకలేదు.. కానీ, విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.. బెంగళూరు పోలీసులు ప్లాస్టిక్ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న వారం తర్వాత, మరణంపై దర్యాప్తులో ఆ వ్యక్తి తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా గుండెపోటు వచ్చి మరణించాడని తేలింది.

Read Also: Job In Cemetery: చదివింది డిగ్రీ.. శ్మశానంలో ఉద్యోగం.. ఎందుకో తెలిస్తే ఔరా! అనాల్సిందే..

బెంగళూరులోని జేపీ నగర్‌ పుట్టెనహళ్లికి చెందిన బాల సుబ్రమణియన్‌ అనే 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.. అవకాశం దొరికినప్పుడల్లా వారి మధ్య ఈ వ్యవహారం సాగుతూ వచ్చింది.. అయితే, సదరు వ్యాపారవేత్త నవంబర్ 16న తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.. ఆమెతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మంచంపైనే కుప్పకూలిపోయాడు.. 16వ తేదీన తన మనవడిని బ్యాడ్మింటన్ కోచింగ్‌ దగ్గర దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 4.55 గంటల ప్రాంతంలో తన కోడలికి ఫోన్‌ చేసి తాను ఆలస్యంగా వస్తానని తెలిపాడు. ఆయన చేసిన చివరి ఫోన్‌ కాల్ అదే.. ఎంతకీ ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో.. అతని కుమారుడు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఒక రోజు తర్వాత.. ప్లాస్టిక్ కవర్లు మరియు బెడ్‌షీట్‌లో ప్యాక్ చేసి అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

అయితే, సదరు వ్యక్తితో తనకు ఉన్న అక్రమ సంబంధం బయటపడితే సమాజంలో తన పరువు పోతుందని భయపడిన మహిళ వెంటనే తన భర్త, సోదరుడికి ఫోన్ చేసింది. మహిళ మరియు ఆమె బంధువులు వ్యాపారవేత్త మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి జేపీ నగర్‌లోని నిర్మూనుష్య ప్రాంతంలో పడేశారు.. ఇక, మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.. కాల్‌ డేటా ఆధారంగా అనుమానం వచ్చి.. ఆ మహిళను ప్రశ్నించారు.. దీంతో.. ఆ మహిళ అసలు విషయం తెలిపిందే.. భయపడే తన 67 ఏళ్ల ప్రియుడి మృతదేహాన్ని పారవేసినట్లు ఒప్పుకుంది. తానే హత్య చేశానని అంటారేమోనన్న భయంతో భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని పడేసినట్టు వెల్లడించింది.. కాగా, బాల సుబ్రమణ్యం తన ఇంట్లో పనిచేసే సదరు మహిళతోచాలా కాలంగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని వెల్లడైంది. ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతుంది నిజమేనా? కాదా? అని నిర్ధారించడానికి బాల సుబ్రమణియన్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.

Exit mobile version