6 Minors Stab Man: హార్న్ వివాదం.. బైక్‌ను వెంబడించి, కత్తితో పొడిచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 Boys Chase Bike Stab Man On Busy Road In Madhya Pradesh: దారికి అడ్డంగా ఉన్నారని హార్న్ కొట్టాడు. కొంచెం పక్కకు తప్పుకోమ్మని కోరాడు. అంతే.. అవతలున్న మైనర్లు ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. తమనే తప్పుకోమ్మని చెప్తావా? అంటూ దాడి చేశారు. వారి నుంచి ఆ యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా.. వెంబడించి మరీ రద్దీగా ఉన్న రహదారిలోనే కత్తితో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డిసెంబర్ 31వ తేదీన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Daughter Killed Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ మాయలో పడి కన్నతల్లినే..
Also Read
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య!
కొత్త సంవత్సరం రోజున స్నేహితులతో కాస్త సరదాగా తిరుగుదామని.. ఆయుష్ (22) అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే భన్వర్ కౌన్ అనే ప్రాంతంలో కొంతమంది అబ్బాయి రోడ్డుపై నిలబడి, రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో ఆయుష్ హార్న్ కొట్టి, వాహనాలను వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరాడు. అప్పుడు ఆ కుర్ర గ్యాంగ్ రెచ్చిపోయింది. దారి ఇచ్చేదే లేదంటూ ఆయుష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆ కుర్రాళ్లకి, ఆయుష్‌కి మధ్య గొడవ జరిగింది. చివరికి ఆయుష్ న్యూ ఇయర్ రోజు రచ్చ ఎందుకులే అనుకొని, తన స్నేహితులతో కలిసి బైక్‌పై అక్కడి నుంచి బయలుదేరాడు.
Instagram Job Fraud: ఆన్‌లైన్ మోసం.. ఉద్యోగం పేరుతో యువతికి టోకరా
అయితే.. ఆ కుర్ర గ్యాంగ్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయుష్‌కి గుణపాఠం చెప్పాలనుకొని, అతడి బైక్‌ని వెంబడించారు. ఈసారి ఆయుష్ బైక్ నడపకుండా వెనుక కూర్చున్నాడు. దాంతో ఆ కుర్ర గ్యాంగ్ వెంబడించి, వెనుక నుంచి ఆయుష్‌పై కత్తితో ఎటాక్ చేశారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత ఆయుష్‌ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. ఇందులో తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు మైనర్లున్నారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
मध्यप्रदेश इंदौर में रात पौने तीन बजे युवक की हत्या, हार्न बजाने की बात पर हुआ था विवाद#Indore #MadhyaPradesh #MPNews pic.twitter.com/SWpWlC6jB2
— manishkharya (@manishkharya1) January 1, 2023
తాజావార్తలు
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
-
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!