NTV Telugu Site icon

Uttar Pradesh: 15 ఏళ్ల బాలిక కిడ్నాప్.. 3 నెలల పాటు అత్యాచారం

Up Kidnap

Up Kidnap

Uttar Pradesh: దేశంలో రోజు రోజుకు కిడ్నాప్ లు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని కేసులు పెట్టి శిక్షించినా.. మార్పు రావడం లేదు. క్రూర మృగాలు చేసే ఈ పనులకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Crime News: గణేష్ నిమజ్జనం చేస్తుండగా కనిపించిన విద్యార్థిని మృతదేహం.. శిరోముండనం చేసి!

మే 28న బాధితురాలిని పవన్ బైండ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమేను గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించి.. ఆగస్టు 28న బల్లియాలో ఉన్న ఆమెను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ, పోక్సో చట్టం కింద అత్యాచారం, కిడ్నాప్‌ ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. నిందితుడు తనను గుజరాత్‌కు తీసుకెళ్లాడని, అక్కడ అతను అక్రమంగా వివాహం చేసుకున్నాడని.. అంతేకాకుండా మూడు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని బాలిక పేర్కొన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ కేసులో తాజాగా నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Chandra Arya: హిందూ కెనడియన్లు భయపడుతున్నారు, దాని 3 కారణాలు ఉన్నాయి.. ట్రూడో పార్టీ ఎంపీ..

Show comments