NTV Telugu Site icon

Hyderabad Crime: ఓల్డ్‌ సిటీలో దారుణం.. బాలిక కిడ్నాప్‌, లాడ్జిలో నిర్బంధించి లైంగికదాడి..

Gang Rape

Gang Rape

ఎన్ని చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు అమలు అవుతున్నా.. ప్రతీ రోజు ఏదో ఒక చోట చిన్నారులు, అమ్మాయిలు, వృద్ధులు అనే తేడా లేకుండా లైంగిక దాడులు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి.. రాజధాని హైదరాబాద్‌లోనే వరుస ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, కొన్ని ఘటనలు సంచలనంగా మారితే.. మరికొన్ని.. చూసిచూడనట్టు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి.. తాజాగా, హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు కామాంధులు.. ఆ బాలికను లాడ్జిలో నిర్బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..

Read Also: Qualities of a Good Incharge: మీలో ఎవరు ‘ఇన్‌ఛార్జ్‌’? ఆ పోస్టుకు కావాల్సిన లక్షణాలు మీకున్నాయా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి

ఓల్డ్‌ సిటీలో కారు వచ్చి బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు.. ఆ 13 ఏళ్ల బాలికను ఓయో రూమ్‌కు తీసుకెళ్లారు.. ఇక, బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. రెండు రోజుల పాటు తమ కామవాంఛ తీర్చుకున్న ఆ ఇద్దరు దుర్మార్గులు.. ఆ తర్వాత బాలికను లాడ్జిలో వదిలి పరారయ్యాడు.. మత్తు నుంచి తేరుకున్న బాలిక.. ఇంటికి చేరుకున్న తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు తెలిపి కన్నీరుమున్నీరైంది.. ఇక, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Show comments