Zomato: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది.. జొమాటో ఎవ్రీడే పేరు ప్రారంభించిన ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తోంది.. రియల్ హోమ్ చెఫ్‌లతో రూపొందించిన తాజా హోమ్లీ మీల్స్‌ను సరసమైన ధరలకు డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.. జొమాటో ఎవ్రీడే ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది.. ఈ సర్వీస్ ద్వారా హోమ్లీ మీల్స్ ప్రారంభ ధర కేవలం రూ. 89.. ఆ తర్వాత ఎంపికను బట్టి రేటు మారిపోతోంది.. ఎప్పటికప్పుడు తమ ఇన్‌స్టంట్ సర్వీస్‌ను రీమోడలింగ్ చేయడంలో భాగంగా ఈ కొత్త సర్వీసు ప్రారంభించినట్టు జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్..
Read Also: Polavaram Back Water: పోలవరం ప్రాజెక్టు.. ఏపీ, తెలంగాణకు కేంద్రం కీలక ఆదేశాలు
బుధవారం రోజు 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించారు జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్.. ఈ సందర్భంగా ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు. “మీ ఇంటి వద్దకే అందజేసే సరసమైన గృహ భోజన సౌకర్యాన్ని అనుభవించండి. నిజమైన హోమ్ చెఫ్‌లచే రూపొందించబడిన మెనులతో, ఇది మీకు.. మీ ఇంటిని గుర్తు చేస్తుందని మేం ఆశిస్తున్నాం” అని గోయల్ వెల్లడించారు.. ఆహార భాగస్వాములు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి హోమ్ చెఫ్‌లు కృషి చేస్తారు.. “కేవలం మెనుని బ్రౌజ్ చేయండి, మీ భోజనాన్ని ఆర్డర్ చేయండి మరియు నిమిషాల్లో మీ ఇంటి వద్దకే వేడి వేడి, రుచికరమైన ఆహారాన్ని పంపిణీ చేస్తాం అంటున్నారు.. జొమాటో ప్రకారం భారతదేశం వంటి మార్కెట్‌లో ఇది చాలా పెద్ద అవకాశం,, కంపెనీ జనవరిలో జొమాటో గోల్డ్ అనే బ్రాండ్-న్యూ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జొమాటో గోల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ‘ఆన్ టైమ్ గ్యారెంటీ’. గోల్డ్ మెంబర్‌లు పీక్ సమయాల్లో మరిన్ని రెస్టారెంట్‌లకు ప్రాధాన్య యాక్సెస్‌ను పొందుతారు.. డెలివరీ మరియు డైనింగ్ అవుట్ రెండింటిలోనూ అనేక రెస్టారెంట్‌ల నుండి ఆఫర్‌లను పొందుతారు.