ఇన్వెస్ట్ మెంట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పెట్టుబడి ఎప్పుడూ కూడా రిస్క్ లేకుండా చూసుకోవాలి. భద్రతతో కూడిన రిటర్న్స్ రావాలంటే పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ అంటున్నారు నిపుణులు. పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం మద్దుతిస్తోంది. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు అందిస్తోంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇందులో రోజుకు రూ. 50 పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షల్లో లాభం అందుకోవచ్చు.
Also Read:IND vs PAK: క్రేజ్ అంటే ఇదేరా.. పెళ్లి వేడుకలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లైవ్
రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కాలవ్యవధి 5 సంవత్సరాలు. మరో ఐదేళ్లు కూడా పొడిగించుకోవచ్చు. ప్రతి నెలా కనీసం రూ. 100 తో రికరింక్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైన పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం వస్తుంది. ఈ పథకంలో 6.7 శాతం వడ్డీ అందిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారు అవసరమైన పత్రాలు సమర్పించి పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. తల్లిదండ్రులు, సంరక్షకుల సమక్షంలో మైనర్ల పేరిట కూడా ఖాతా ఓపెన్ చేయొచ్చు.
Also Read:MK Stalin: “కుటుంబ నియంత్రణ” వల్ల తమిళనాడులో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం..
రికరింగ్ డిపాజిట్ పథకంలో రోజుకు రూ. 50 అంటే నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టారనుకుందాం. అప్పుడు మీ పెట్టుబడి సంవత్సరానికి రూ. 18 వేలు అవుతుంది. ఇలా ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడుమీ పెట్టుబడి రూ. 90 వేలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు ప్రకారం రూ. 17,050 వడ్డీ ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ నాటికి పెట్టుబడి, వడ్డీ కలుపుకుని రూ. 1,07,050 వస్తుంది. మరో పదేళ్లు పొడిగిస్తే అప్పుడు మీ చేతికి రూ. 2,56,283 అందుతుంది.