రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
రెపో రేటు అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులు అప్పులు తీసుకుంటాయి. ఈ వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. రేపో రేటునను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఆర్‌బీఐ తక్కువ రేటుకు రుణాలు ఇస్తే, బ్యాంకులు కూడా వినియోగదారులకు తక్కువ రేటుకు రుణాలు అందిస్తాయి. ఇందులో గృహ రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం మొదలైనవి ఉంటాయి. రెపో రేటు తగ్గింపు వల్ల మధ్యతరగతి వారికి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఇది ఈఎంఐ భారాన్ని కూడా బ్యాంకులు తగ్గించగలవు.. కానీ ఇక్కడే ఓ తిరకాసు కూడా ఉంది. ఒక్కోసారి రెపో రేటు తగ్గించినా బ్యాంకులు మాత్రం.. వాటి ప్రయోజనాలను సామాన్యులకు అందించక పోవచ్చు. ఇందుకు బదులుగా బ్యాంకులు తమ ఆదాయం పెంచుకోవాలని చూస్తాయి. అంటే రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపైనే ఆధారపడి ఉంటుంది.
READ MORE: Netflix: నెట్ ఫ్లిక్స్ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టిందే!
ఇదిలా ఉండగా.. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించింది. రెపో రేటు చివరిసారిగా మే 2020లో 0.40% తగ్గింది. ఆ తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించారు. 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచింది. చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 2024లో జరిగింది.