Vodafone Idea: 50GB ఫ్రీ డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్.. ఈ ప్లాన్లపై వొడాఫోన్ ఆఫర్లు..!
- స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్..
- ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌పై అదనపు డేటా.. ఓటీటీ సదుపాయాలు..
- ఆగస్టు 28వ తేదీ వరకే ఈ ప్రయోజనాలు పొందే అవకాశం: వొడాఫోన్ ఐడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తెచ్చింది. ప్రీ- పెయిడ్ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌పై అదనపు డేటా, ఓటీటీ సదుపాయాల్ని అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీఐ యూజర్లకు ఈ ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఆగస్టు 28వ తేదీ వరకే ఈ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది అని ప్రకటించింది.
Read Also: Vijayawada Airport: ఢిల్లీ- అమరావతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు.. ఎప్పటి నుంచి అంటే..?
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
అయితే, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఆరు నెలల రీఛార్జ్ ప్లాన్ రూ.1,749పై 30 జీబీ అదనపు డేటాను ఫ్రీగా అందిస్తుంది. ఈ అదనపు డేటా 45 రోజుల్లోగా వినియోగించుకోవాలి అని సూచించింది. అదే వీఐ అందిస్తున్న రూ.3,499, రూ.3,699, రూ.3,799 .. ఈ వార్షిక ప్లాన్ రీఛార్జితో అదనంగా 50 జీబీ డేటా పొందొచ్చు అని పేర్కొనింది. దీని వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే అని చెప్పుకొచ్చింది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో.. లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తున్నట్లు వెల్లడించింది. వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకొనే ప్రీ- పెయిడ్ వినియోగదారుల వార్షిక ప్లాన్‌పై 100 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!