NTV Telugu Site icon

Adani Group: గౌతమ్ అదానీ, సమీప బంధువు సాగర్‌కి సమన్లు

Gautam Adani

Gautam Adani

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్‌ అదానీలపై యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరిపై అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా.. ఈ దర్యాప్తులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఎన్ఫోర్స్మెంట్ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ సంజయ్ వాధ్వా కీలక పాత్ర పోషిస్తున్నారు.

అదానీ ఇచ్చిన అభియోగాలు?
గౌతమ్ అదానీ (Gautam Adani), సాగర్ అదానీ ఒక ఆఫర్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రీన్ బాండ్లను కొనుగోలు చేయడానికి యుఎస్ (usa)పెట్టుబడిదారులను ప్రేరేపించారు. అదానీ గ్రీన్ ప్రాజెక్ట్ భారత్ లో విజయవంతం అవుతుందని, అందుకు వీలుగా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు పెద్ద ఎత్తున లంచాలను ఇచ్చామని వారు యుఎస్ పెట్టుబడిదారులకు చెప్పారు. ఇది అమెరికాలో సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘన అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ స్పష్టం చేసింది.

స్పందించిన సంజయ్ వాధ్వా 
సౌర విద్యుత్ ఒప్పందాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించడానికిి భారత ప్రభుత్వ ఉన్నతాధికారులకు సుమారు రూ.2,100 కోట్ల మేర లంచం ఇచ్చినట్టు అదానీ  ప్రతినిధులపై హైప్రొఫైల్ లంచం ఆరోపణలు కేంద్రీకృతమయ్యాయి. వైట్ హౌజ్ స్పందించేవరకు వెళ్లిన ఈ అభియోగాలపై దర్యాప్తును సంజయ్ వాధ్వా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సెక్యూరిటీల ఉల్లంఘనలకు కార్పొరేట్ లీడర్లను బాధ్యులను చేయడంలో వాధ్వాది అందెవేసిన చేయి. సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సీనియర్ కార్పొరేట్ అధికారులు, డైరెక్టర్లతో సహా ఇందులో పాత్ర ఉన్న అందరినీ కమిషన్ విచారిస్తుందని ఇటీవల ఆయన స్పష్టం చేశారు.

Show comments